బిగ్ బాస్ తెలుగుకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఎన్టీఆర్ కి ఒక ఆసక్తిమైన కోరిక కలిగింది.
ఇవాళ ఉదయం జరిగిన బిగ్ బాస్ ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి ఎన్టీఆర్ ని- మీకు ఎవరి గురించి అయిన తెలుసుకోవాలి అని ఉందా? అని అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెబుతూ- తాను షూటింగ్ కి వెళ్ళిపోయాక తన భార్య,కొడుకు ఇద్దరు ఏమి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అని ఉందంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.
ఎందుకంటే, కొన్ని రోజుల ముందు వరకు తన కొడుకు అభయ్ తనకు బాగా సన్నిహితంగా ఉండేవాడని కాని ఇప్పుడు అమ్మ కూచిగా మారిపోయాడని. ఇలా ఎలా జరిగింది అనే విషయాన్ని తాను తెలుసుకోవాలనుకుంటున్నట్టు చెప్పి అందరిని నవ్వించాడు.