సీనియర్ నటి రాజకీయ నాయకురాలైన విజయశాంతికి మద్రాసు హైకోర్టు ఝలక్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే, చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఉన్న విజయశాంతి ఆస్తులని 2006లో ఇందర్ చంద్ అనే వ్యక్తికి సుమారు రూ 5కోట్లకు అమ్మేసిందట. దానికి సంబంధించి సదరు వ్యక్తి పేరుకి పవర్ అఫ్ అటార్నీ ఇచ్చేందుకు సుమారు రూ 4.7కోట్లు మేరకు అతని వద్ద నుండి విజయశాంతి తీసుకుందట.
ఇదంతా జరిగాక ఇదే ఆస్తిని మరొక వ్యక్తికి అమ్మేశారు అంటూ విజయశాంతి పై ఇందర్ చంద్ అనే వ్యక్తి స్థానిక కోర్టుని ఆశ్రయించగా, ఆ కోర్టు విజయశాంతికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనితో అతను ఈ కేసుని మద్రాసు హైకోర్టు వరకు తీసుకెళ్ళగా, ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఇరువురిని ఒర్తుకి వెలుపల సెట్టిల్ చేసుకోమని సూచించింది.
ఆరోజు మాత్రం తప్పనిసరిగా విజయశాంతిని హజరుకమ్మని నోటిసు ఇచ్చింది.