'చిల్ల్‌డ్‌ ఛీర్స్‌' షేర్‌ చేసుకున్న సల్మాన్‌, ఎన్టీఆర్‌!

మరిన్ని వార్తలు

బొట్టు బొట్టులా అంటూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ బ్రైట్‌ విజువల్‌లో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ యాపీ 'ఫిజ్‌'కి ఇండియా మొత్తం బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇకపై ఈ ప్రొడెక్ట్‌ని ఎన్టీఆర్‌ కూడా షేర్‌ చేసుకోనున్నారట బ్రాండ్‌ అంబాసిడర్‌గా. అంటే పార్లే అగ్రో డ్రింకింగ్‌ ప్రొడెక్ట్‌ అయిన ఫిజ్‌ కమర్షియల్‌ యాడ్‌లో సౌత్‌కి సంబంధించి, సల్మాన్‌ బదులు ఇకపై ఎన్టీఆర్‌ కనిపించనున్నారన్న మాట. ఇప్పటికే నవరత్న్‌ కూల్‌ తైలం తదితర కూల్‌ కమర్షియల్‌ యాడ్స్‌లో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఇక నుండి చల్ల చల్లగా ఫిజ్‌ యాడ్‌తోనూ ఎన్టీఆర్‌ సందడి చేయనున్నారన్న మాట.

 

ఇక సినిమాల విషయానికి వస్తే, 'అరవింద సమేత' సినిమా తర్వాత ఎన్టీఆర్‌, రాజమౌళి మల్టీ స్టారర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్నారు. చరణ్‌, ఎన్టీఆర్‌ కాలు, చేతి గాయాల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వాయిదా పడింది. గాయాల నుండి తేరుకోగానే తిరిగి 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌లో పాల్గొననున్నారు ఎన్టీఆర్‌. ఈలోగా కమర్షియల్‌ యాడ్స్‌తో కాలక్షేపం చేస్తున్నారన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS