యంగ్‌ టైగర్‌ డెడికేషన్‌కి ఫిదా అవుతున్నారు.!

By iQlikMovies - September 10, 2018 - 14:35 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'అరవింద సమేత' సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది ప్రస్తుతం. ఇటీవలే తండ్రిని పోగొట్టుకున్న ఎన్టీఆర్‌ని సెట్స్‌లో చూస్తున్న వారు కొంత బాధాతప్త హృదయంతో పలకరిస్తున్నారు. హరికృష్ణ మరణం నిజంగానే ఎన్టీఆర్‌కి తీరని లోటు. ఆ లోటును భర్తీ చేయడం ఎవరి తరమూ కాదు. ఆ విషాదం నుండి ఇంకా పూర్తిగా తేరుకోకుండానే ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌కి హాజరు అవుతున్నాడు.

 

నిజానికి కొన్ని రోజుల పాటు షూటింగ్‌ వాయిదా వేద్దామనుకున్నారట. అయితే తన కారణంగా షూటింగ్‌ వాయిదా పడకూడదనీ ఎన్టీఆర్‌ భావించాడు. ఆల్రెడీ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా అనౌన్స్‌ చేసిన డేట్‌కే సినిమా రిలీజ్‌ కావాలని ఎన్టీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడట. దాంతో కొండంత విషాదాన్ని మనసులోనే దాచుకుని, పైకి ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్‌. వర్క్‌ మోడ్‌లో ఎన్టీఆర్‌ ఎనర్జీని, కమిట్‌మెంట్‌నీ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న సాంగ్‌ చిత్రీకరణ చాలా బాగా వస్తోందట. ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో అభిమానులు ఇంకా ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు. తమ అభిమాన హీరో క్లిష్టమైన పరిస్థితుల్లో షూటింగ్‌కి హాజరవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, అతనికి బాసటగా నిలుస్తున్నారు. 

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS