శ్యామల ఔట్‌.. అమిత్‌ మళ్ళీ బతికిపోయాడు

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ రియాల్టీ షో ప్రేక్షకుల ఊహలకు అందకుండా సాగుతోంది. ఇంకొంచెం మసాలా అంటూ పదే పదే ప్రమోషన్స్‌లో భాగంగా హోస్ట్‌ నాని చెబుతన్నట్లే మసాలా ఎక్కువగానే ఉంది ఈ సీజన్‌ బిగ్‌బాస్‌లో. ముఖ్యంగా ఎలిమినేషన్‌ వ్యవహారం మాత్రం ఊహించినట్లుగా అస్సలు జరగడం లేదు. 

ఈ ఎలిమినేషన్‌లో తీర్పు ఇచ్చేది ప్రేక్షకులే అయినా, ఆ ప్రేక్షకుల ఊహకే అందకపోవడం ఆశ్చర్యరకం. ఈ వారం ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్న కౌషల్‌, దీప్తి, శ్యామల, అమిత్‌లలో అమిత్‌ బయటికి వెళ్లిపోతాడనుకున్నార అంతా. కానీ అమిత్‌ మళ్ళీ సేవ్‌ అయ్యాడు. కానీ ఈసారి శ్యామల బలైపోయింది. రీ-ఎంట్రీ ఇచ్చారన్న కారణంగా తొలుత నూతన్‌ నాయుడుని బయటకు పంపిన బిగ్‌ బాస్‌, ఈసారి అదే రీజన్‌తో శ్యామలని బయటకు పంపినట్లు తెలుస్తోంది. లేకపోతే ఓట్ల పరంగా అమిత్‌ కంటే నూతన్‌కే ఎడ్జ్‌ ఉందనే ప్రచారం సాగింది. 

శ్యామల విషయంలో కూడా ఇలాగే జరగడంతో బిగ్‌బాస్‌ అభిమానులు డిజప్పాయింట్‌ అవుతున్నారు. ఫైనల్‌గా ఇదొక గేమ్‌ షో. గేమ్‌లో ఈక్వేషన్స్‌ ఎలాగైనా మారిపోవచ్చు. 

మొత్తానికి చివరి రోజుల్లో బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌ ఉత్కంఠతో సాగుతోంది. టాప్‌ 5లో ఎవరుండబోతున్నారు? టాప్‌ 3 కి చేరబోయేదెవరు? అనే అంశాలపై ఆశక్తి కొనసాగుతోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS