సుస్మితాసేన్‌ అదరగొట్టేసింది. చూస్తే అంతా షాకవ్వాల్సిందే.!

మరిన్ని వార్తలు

ఈ మధ్య డాన్సులు చేస్తూ ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ఫ్యాషన్‌ అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా సీనియర్‌ హీరోయిన్లు కూడా ఈ డాన్సింగ్‌ వీడియోల ద్వారా సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. 

తాజాగా అందాల భామ సుస్మితాసేన్‌ 'దిల్‌బరే దిల్‌బరే..' సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేసి నెటిజన్లకు కొత్త కిక్కిచ్చింది. నాలుగు పదుల వయసులో ఆమె ఫిజిక్‌, ఆమె నడుం తిప్పుడు చూస్తే అంతా షాకవ్వాల్సిందే. అప్పుడెప్పుడో నాగార్జునతో 'రక్షకుడు' సినిమాలో నటించిన తన అందంతో కుర్రకారును మైమరిపించేసిందీ ముద్దుగుమ్మ. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బెల్లీ డాన్స్‌తో సోషల్‌ మీడియాలో సుస్మితాసేన్‌ వేసిన స్టెప్పులు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి. 

ఇదేదో సినిమా ప్రమోషన్స్‌ కోసం అయితే కాదు. వయసు పైబడినా తనలోని డాన్సింగ్‌ టాలెంట్‌ ఏమాత్రం తగ్గలేదనీ, ఫిగర్‌ కూడా రెండు పదుల వయసును తలపిస్తున్నట్లుగానే ఉందనీ నిరూపిస్తోందీ వీడియో. ఈ వీడియో చూసి, ఈ తరం ముద్దుగుమ్మలు జలస్‌ ఫీలవ్వాల్సిందే. అందుకే నెట్టింల్లో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అయిపోయింది. ఈ మధ్య శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ తన తొలి సినిమా 'ధడక్‌' ప్రమోషన్స్‌లో భాగంగా డాన్స్‌ నేర్చుకుంటున్న వీడియోలు ఇలాగే పోస్ట్‌ చేసింది. 

'దంగల్‌' బ్యూటీ ఫాతిమా సనాషేక్‌ కూడా ఇలాగే బోలెడన్ని డాన్సింగ్‌ వీడియోలు పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలు చూసి బాక్సింగ్‌ టాలెంటే కాదు, ఇంత డాన్సింగ్‌ టాలెంట్‌ కూడా ఉందా.. ఈ అమ్మడిలో అని ఆశ్చర్యపోయారంతా. ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు పోస్ట్‌ చేసే డాన్సింగ్‌ వీడియోలకు మంచి రెస్పాన్స్‌తో పాటు కొత్త రకమైన కిక్‌ వస్తోందిప్పుడు సోషల్‌ మీడియాలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS