ఎన్టీఆర్‌ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌ ఏంటంటే.!

By iQlikMovies - August 10, 2018 - 11:35 AM IST

మరిన్ని వార్తలు

మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌ ఇచ్చేశాడు. తన కొత్త సినిమా టైటిల్‌తో పాటు, ఫస్ట్‌లుక్‌ టీజర్‌ని కూడా రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ కళ్లల్లో ఆనందం నింపేశాడు. 

ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌ వంతు వచ్చింది. 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రానికి సంబంధించి ఇంతవరకూ ఏ సమాచారం లేదనే చెప్పాలి. కథ ఇలా ఉండబోతోందట. ఎన్టీఆర్‌ పాత్ర అలా ఉండబోతోందట.. అనే గాసిప్స్‌ తప్ప పక్కా సమాచారమ్‌ లేదింతవరకూ. అందుకే ఆ సస్పెన్స్‌కి తెర పడేలా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అండ్‌ టీమ్‌ ఓ టీజర్‌ని ప్లాన్‌ చేసిందట. ఆ టీజర్‌ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. 

సినిమాకి సంబంధించిన డీటెయిల్స్‌ని క్లియర్‌ కట్‌గా ఈ టీజర్‌లో శాంపిల్‌గా చూపించనున్నారనీ సమాచారమ్‌. ఒకవేళ అదే జరిగితే, నిజంగానే ఎన్టీఆర్‌ అభిమానులకు ఇది పండగే. 'అజ్ఞాతవాసి' చిత్రంతో ఫెయిల్యూర్‌ చవి చూసినా డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై ఆడియన్స్‌కి నమ్మకం పోలేదు. ఎన్టీఆర్‌ సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్‌ చేశారు. దాంతో ఈ అంచనాలను అందుకునే దిశగా త్రివిక్రమ్‌ ఈ సినిమాని రూపొందించాలనీ, అత్యంత కీలకమైన బాధ్యతగా ఈ సినిమాని తీసుకున్నారు. 'అత్తారింటికి దారేది' స్థాయిలో ఈ సినిమాని విజయవంతం చేయాలనే కసితో ఉన్నాడట త్రివిక్రమ్‌. 

హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగమ్మాయి ఈషారెబ్బ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS