క్రికెట్‌ బిగ్‌బాస్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌

మరిన్ని వార్తలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త సీజన్‌ స్టార్ట్‌ అవుతోంది. స్టార్‌ గ్రూప్‌ తెలుగు నాట ఈ ఐపీఎల్‌ని ప్రమోట్‌ చేసేందుకు ఎన్టీఆర్‌ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. 

స్టార్‌ గ్రూప్‌కి చెందిన మాటీవీలో ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ రియాల్టీ షో చేశాడు. తెలుగు బుల్లితెరపై కనిపించడం ఎన్టీఆర్‌కి అదే తొలిసారి. వస్తూ వస్తూనే టీఆర్‌పీ రేటింగ్స్‌ తాట తీశాడు యంగ్‌ టైగర్‌. ఎన్టీఆర్‌ స్టామినాకి స్టార్‌ గ్రూప్‌ ఫిదా అయిపోయింది. ఈ క్రమంలోనే, స్టార్‌ గ్రూప్‌ ఎన్టీఆర్‌ని ఐపీఎల్‌ కోసం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిందట. ఈ మేరకు భారీ డీల్‌ కుదిరినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్‌ అంటే ఆ కిక్కే వేరు. దానికి ఎన్టీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటే, ఆ కిక్‌ పదింతలవుతుంది. 

ప్రస్తుతం ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుంది. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే జిమ్‌లో కుస్తీలు పట్టి, చాలా బరువు తగ్గాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స్లిమ్‌ అండ్‌ స్మార్ట్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు. 'జై లవకువ' టైంలో ఎన్టీఆర్‌ 'బిగ్‌బాస్‌' ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు టచ్‌లో ఉన్నాడు. 

ఇప్పుడు ఈ తాజా సినిమా టైంలో కూడా ఐపీఎల్‌ పుణ్యమా అని, ఎన్టీఆర్‌ బుల్లితెర ప్రేక్షకులకు టచ్‌లో ఉండబోతున్నాడన్న విషయం తెలిసి, ఎన్టీఆర్‌ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 'బిగ్‌బాస్‌'లో తన చిలిపి మాటకారితనం, అల్లరి చేష్టలతో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాడు. మళ్లీ బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడి మొదలు కానుందంటే, ఆ సమయం ఎప్పుడెప్పుడా అని బుల్లితెర ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS