ఇల్లు ఊడ్చిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌!

మరిన్ని వార్తలు

‘బీ.. ది.. రియల్‌ మ్యాన్‌..’ అంటూ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తనదైన స్టయిల్లో ఇల్లు ఊడ్చేశాడు. పాత్రల్నీ కడిగి శుభ్రం చేసేశాడు. జక్కన్న రాజమౌళి ఇచ్చిన ఛాలెంజ్‌ని యంగ్‌ టైగర్‌ స్వీకరించకుండా వుంటాడా.? కరోనా వైరస్‌ కారణంగా వచ్చిపడ్డ లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఇంటిపట్టునే వుండాల్సి వస్తోంది అందరికీ. ఈ క్రమంలో ఇంటి పట్టునే వుండి, ఇంటి పనులు చేస్తే తప్పేంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. యంగ్‌ హీరో నాగశౌర్య ఇంట్లో అమ్మకు సాయంగా వుండి, అవాకాయ్‌ కలపడంలో సాయపడ్డాడు. కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ చీపురు పట్టి ఊడ్చేశాడు ఇంట్లో. మెగాస్టార్‌ చిరంజీవి, ఇంటి ప్రాంగణంలోని వాక్‌ వేని శుభ్రం చేశారు.

ఇంకా ఇంకా చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, ‘బీ.. ది.. రియల్‌ మ్యాన్‌..’ ఛాలెంజ్‌ని రాజమౌళికి విసిరితే, ఆ ఛాలెంజ్‌ని రాజమౌళి స్వీకరించి, ఇంట్లో పనులు చేసి చూపించి, యంగ్‌ టైగర్‌కీ అలాగే మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌కీ ఇంకొందరికి ఛాలెంజ్‌ విసిరాడు. ఆ ఛాలెంజ్‌ స్వీకరించి, ఇంటి పనుల్లో తన సత్తా చూపించిన యంగ్‌ టైగర్‌, ఈసారి బాబాయ్‌ బాలయ్యకీ, మెగాస్టార్‌ చిరంజీవికీ, అక్కినేని నాగార్జునకీ, విక్టరీ వెంకటేష్‌కీ, కొరటాల శివకీ ఛాలెంజ్‌ విసరడం గమనార్హం. మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం... అంటున్నాడు మన యంగ్ టైగర్. మన ఇంటి పని మనం చేస్తే తప్పేంటి.? మన హీరోలే ఆ పని చేస్తున్నప్పుడు మనమూ మన ఇంట్లో పనులు చక్కబెట్టేద్దామని అభిమానులూ ముందుకొస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS