ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 2 షూటింగ్ అప్ డేట్స్..!

మరిన్ని వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో బుల్లితెర పై తన సత్తా ఏంటో చూపించాడు. తన వ్యాఖ్యానంతో మొత్తం బుల్లితెర వీక్షకులని తనవైపుకి తిప్పుకోగాలిగాడు. ఆ రియాలిటీ షో సూపర్ హిట్ అయిందంటే దానికి ముఖ్య కారణాలలో ఒకటి ఎన్టీఆర్ అన్నది నగ్న సత్యం.

ఇక బిగ్ బాస్ సీజన్ 2 కి సంబంధించి అప్పుడే పనులు మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రెండవ సీజన్ లో మొదటి సీజన్ ని మించేలా ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. అలాగే మొదటి సీజన్ చేస్తున్నపుడు ఎలాగైతే సినిమా షూటింగ్ చేస్తూనే వ్యాఖ్యాతగా వ్యవహరించాడో ఇప్పుడు కూడా అదే పంథాని తారక్ కొనసాగించనున్నట్టు తెలిసింది.

అయితే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనేవారి సంఖ్య, బిగ్ బాస్ హౌస్ లో ఎన్నిరోజులు ఉండాలి అలాగే ఈ సీజన్ కూడా పూణేలోనా లేక హైదరాబాద్ లో నిర్వహిస్తారా లేక వేదికలో మార్పు ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

ఏదేమైనా దీనికి సంబంధించిన బిగ్ బాస్ 2 ముచ్చట్లు త్వరలోనే బయటికి రానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS