క్రికెట్, సినిమా- ఈ రెండు మన దేశంలో అత్యంత ఆదరణ కలిగిన రెండు అంశాలుగా మనం చెప్పొచ్చు. అయితే ఈ రెంటికి సంబంధించిన వ్యక్తులు ప్రేమలో పడితే ఏమవుతుందో అన్నది ఇప్పటికే చాలా సార్లు చూశాము. అనుష్క శర్మ-విరాట్ కోహ్లిల పెళ్ళి పైన చెప్పినదానికి తాజాగా ఉదాహరణ.
అయితే ఇప్పుడు మేము చెప్పబోయే అంశం నటి-క్రికెటర్ ప్రేమ కాదు కేవలం ఒక నటికి క్రికెటర్ పైన ఇష్టం మాత్రమే. ఇంతకి ఆ నటి ఎవరంటే- రాశి ఖన్నా మరి ఆ క్రికెటర్ ఎవరో తెలుసా- ఫాస్ట్ బౌలర్ బుమ్రా. స్వతహాగా క్రికెట్ ని ఇష్టపడే రాశి ఖన్నా తనకి ప్రస్తుత టీం లో బాగా నచ్చిన ఆటగాడు ఎవరు అని అడగగా వెంటనే బౌలర్ బుమ్రా అని చెప్పిసింది.
కారణమేంటి అని అడగగా- బుమ్రా బౌలింగ్ శైలి తనకి చాలా నచ్చుతుంది అని అతను బౌలింగ్ చేసేటప్పుడు మ్యాచ్ చూడడాన్ని ఇష్టపడతాను అని చెప్పుకొచ్చింది. అలాగే టీం ఇండియా క్రికెట్ మ్యాచ్చులు ఎప్పుడు ఉన్నా తప్పక చూస్తాను అని తెలిపింది.
మొత్తానికి క్రికెట్ ని అమితంగా ఇష్టపడే నటీమణులలో రాశి ఖన్నా కూడా చేరిపోయింది. ఈ వివరాలన్నీ తన తాజా చిత్రం తొలిప్రేమ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చెప్పింది.