గత రెండు నెలలుగా బుల్లితెరపై సందడి చేస్తోన్న ఎన్టీఆర్ బిగ్ షో 'బిగ్‌బాస్' మొదటి సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇన్ని రోజులుగా ఈ షో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది. స్టార్టింగ్ బోరింగ్ షో అనిపించినా, రెండు మూడు వారాలు గడిచేసరికి 'బిగ్‌బాస్' షో జోరు పుంజుకుంది. అలాగే వీకెండ్స్ ఎన్టీఆర్ హోస్ట్‌గా నట విశ్వరూపం చూపించేస్తున్నాడు. ప్రేక్షకులు చూపు తిప్పుకోకుండా, స్టే ట్యూన్‌డ్ అనేలా ఆ టైంకి టీవీలకి అతుక్కుపోతున్నారు. ఇంతవరకూ ఉన్న టీఆర్‌పీ రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి ఈ షోతో. ఇదిలా ఉండగా, లాస్ట్ రెండు వారాలు ఎన్టీఆర్ బీభత్సంగా ప్రేక్షకుల్ని ఆలరించేస్తున్నారు. ఈ వీకెండ్‌లో ఎన్టీఆర్ హౌస్‌లోకి ఎంట్రీ కూడా ఇచ్చేశారు. ఓన్లీ ఎన్టీఆర్ ఎంట్రీనేనా అది. కాదు కాదు, అసలు సిసలు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే అదే. స్వయంగా తన చేతులతో వంట చేసి హౌస్ మేట్స్‌కి ఆప్యాంగా వడ్డించారు ఎన్టీఆర్. నిజంగా ఎన్టీఆర్‌కి హ్యాట్సాప్ చెప్పి తీరాల్సిందే సుమీ. తెలుగు రాష్ట్రాల ప్రజానీకం మొత్తం ఎన్టీఆర్ అభిమానానికి దాసోహం అయిపోయారంతే. చక్కగా మటన్ పులావ్, టమాటా చెట్నీ చేసి హౌస్ మేట్స్‌కి ప్లేట్స్‌లో పెట్టి వడ్డించడం టీవీల్లో చూసిన ప్రతీ ప్రేక్షకుడు హ్యాపీగా ఫీలయ్యాడు. స్వయంగా తమ ఇంటికి వచ్చి ఎన్టీఆర్ వంట చేసి, ఆప్యాయంగా వడ్డించాడా అన్నంత ఫీలింగ్‌లోకి వెళ్లిపోయారు జనం. ఎన్టీఆర్ చేసిన మటన్ పులావ్, టమాటా చెట్నీని ఆడియన్స్ తమ ఇంట్లో తయారు చేసుకుని ఎన్టీఆర్ స్వయంగా చేసి పెట్టినట్లుగా ఫీలయ్యారు. టేస్ట్ సూపర్ అంటూ ఆస్వాదిస్తూ తిన్నారు కూడా. సోషల్ మీడయాలోనూ ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. వహ్‌వా ఎన్టీఆర్, రియల్లీ హ్యాట్సాప్ టు యు!