'అరవింద సమేత' సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మెగా మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా అప్డేట్స్ సంగతి ఎలా ఉన్నా, తాజాగా ఎన్టీఆర్ నుండి ఓ కొత్త అప్డేట్ వచ్చింది. ఒట్టో అనే మెన్స్ వేర్ బ్రాండ్‌కి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అందులో భాగంగా షూట్ చేసిన ఓ యాడ్ తాజాగా హల్చల్ చేస్తోంది.
ఈ యాడ్‌లో మగాళ్లకు సంబంధించిన అన్ని రకాల దుస్తుల్నీ ఫ్రేమ్కొకటి చొప్పున మారుస్తూ, ఎన్టీఆర్ ఈ బ్రాండ్‌ని గ్రాండ్‌గా ప్రమోట్ చేశారు. బ్రాండ్ సంగతి సరే కానీ, ఈ యాడ్ షూట్లో మాత్రం ఎన్టీఆర్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. అన్నింటికీ మించి, ఈ యాడ్‌లో కనిపించిన లుక్స్‌లోనే 'ఆర్ఆర్ఆర్'లో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్ అంటూ ఈ యాడ్‌ని ఎన్టీఆర్ లుక్స్ కోసం మరింత ఆశక్తిగా వీక్షించారు ఫ్యాన్స్.
చరణ్ కాలికి గాయం కారణంగా 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ చేతికి కూడా గాయం కావడంతో షూటింగ్‌కి మరింత లేట్ అయ్యింది. అయితే, ఇంతవరకూ షూటింగ్ అప్డేట్స్ ఏమీ లేవు కానీ, ఆ లోగా 'ఒట్టో' పుణ్యమా అని యాడ్ షూట్లో ఎన్టీఆర్‌ని ఇదిగో ఇలా చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు మరి.