మహేష్ కోసం ఎన్టీఆర్...

By iQlikMovies - April 06, 2018 - 18:07 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు బహిరంగ సభ పేరుతో రేపు హైదరాబాద్ లో జరగనున్న భరత్ అనే నేను ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంది అని సమాచారం.

ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తుండడంతో ఒక్కసారిగా ఈ ఈవెంట్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అసలే ఇది సూపర్ స్టార్ ఈవెంట్ కావడం దానికి నందమూరి పవర్ తోడు అవ్వడంతో ఈ ఈవెంట్ కి కొత్త రంగ వచ్చేసింది.

అయితే ఈ ఈవెంట్ కి తారక్ రావడానికి ముఖ్య కారణం తారక్-మహేష్ మధ్య స్నేహం అలాగే తారక్-కొరటాల శివ మధ్య ఉన్న అనుబంధం. ఈ రెంటివల్ల రేపు జరగబోయే ఈవెంట్ కి తారక్ ఈ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెప్పడానికి వస్తున్నాడు.

రేపు ఈ ఈవెంట్ కి వచ్చినవారికి ఒకే పాస్ కి ఇద్దరు హీరోలు కనిపించనున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS