యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ 'నో' చెప్పాడా.?

మరిన్ని వార్తలు

ఎన్‌టిఆర్‌ బయోపిక్‌కి సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ లుక్‌ బయటకు వచ్చింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు పాత్రలో బాలకృష్ణ, స్వర్గీయ హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌రామ్‌.. ఆ లుక్‌లో కన్పిస్తున్నారు. కళ్యాణ్‌రామ్‌కి సంబంధించి ఇది చాలా ఎమోషనల్‌ థింగ్‌. ఎందుకంటే, ఇటీవలే హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం. 

ఈ నేపథ్యంలోనే, నాన్న పాత్రలో నటిస్తున్న కళ్యాణ్‌రామ్‌ చాలా ఎమోషనల్‌ అవుతున్నాడు. ఇదిలా వుంటే, ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర కోసం తొలుత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పేరు ప్రతిపాదనకు వచ్చిందట. కానీ, అందుకు యంగ్‌ టైగర్‌ 'నో' చెప్పాడని ఓ గాసిప్‌ విన్పిస్తోంది. స్వయంగా క్రిష్‌, యంగ్‌ టైగర్‌తో మాట్లాడినట్లుగా ఆ గాసిప్‌ని బట్టి అర్థమవుతోంది. అయితే, అలాంటి ప్రతిపాదన ఏదీ యంగ్‌ టైగర్‌ వద్దకు వచ్చి వుండకపోవచ్చని చాలామంది అభిప్రాయపడ్తున్నారు. 

నిజానికి, 'తాత పోలికలు..' అంటూ ఎక్కువగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గురించే మాట్లాడుతుంటారు. అలాంటిది ఎన్టీఆర్‌, తన తాత బయోపిక్‌లో నటించకపోవడం ఆశ్చర్యకరమే. 'మహానటి' సినిమా టైమ్‌లో కూడా స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్ర గురించి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వద్దకు ప్రతిపాదనలు వస్తే, సింపుల్‌గా 'సారీ' చెప్పేశాడట. తాత పాత్రలో నటించడం ఇష్టం లేక కాదు, ఆ పాత్రలో నటించి, ఏ చిన్న పొరపాటు జరిగినా.. ఆ తాతను అవమానించినట్లవుతుందనే భయంతోనే ఎన్టీఆర్‌ ఇలా చేస్తున్నాడనుకోవాలి. 

'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' విషయానికొస్తే, ఈ సినిమాని రెండు పార్టులుగా విడుదల చేయనున్న సంగతి తెల్సిందే. ఒకటి 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు' కాగా, మరొకటి 'ఎన్‌టిఆర్‌ మహానాయకుడు'. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS