దేవర మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: దేవర
దర్శకత్వం: కొరటాల శివ
కథ - రచన: కొరటాల శివ


నటీనటులు: ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్‌ అలీఖాన్‌, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో, అజయ్, మురళీ శర్మ తదితరులు.


నిర్మాతలు: సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్‌


సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు
ఎడిటర్: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌


బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్
విడుదల తేదీ: 27 సెప్టెంబర్ 2024 
 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5

ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


RRR సినిమా తరవాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారాడు. RRR తో పాన్ ఇండియా స్టార్ గా మారి, ఈ మూవీ హిట్ తరవాత పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. ఆరేళ్ళ తరవాత యంగ్ టైగర్ 'దేవర' తో సోలోగా వేటకి దిగాడు. 'జనతా గ్యారేజ్' తరవాత కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న రెండో సినిమా ఇది. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్న మూవీ, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపిస్తున్నాడు. మరాఠీ హీరోయిన్ శృతి మరాఠే కూడా ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తోంది. దేవర మూవీకి ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వలన మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు థియేటర్స్ లో దేవర సందడి మొదలైంది. దేవర ఆడియన్స్ అంచనాలను అందుకున్నాడో లేదో? ఎన్టీఆర్ కి కిక్కిచ్చే హిట్ దొరికిందో లేదో చూద్దాం. 

    
కథ :
నిఘా వర్గాల హెచ్చరికలతో 1996లో 'యతి' అనే ఒక గ్యాంగ్ స్టార్ ను పట్టుకోవటానికి శివం (అజయ్) ఏపీ తమిళనాడు బోర్డర్లో ఉన్న రత్నగిరికి వెళ్తాడు. యతి కోసం వెళ్లిన శివం అదే ప్రాంతానికి చెందిన దేవర (ఎన్టీఆర్) గురించి సింగప్ప(ప్రకాష్ రాజ్) ద్వారా తెలుసుకుని షాక్ అవుతాడు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి. సముద్రానికి ఆనుకుని ఉన్న కొండపై నాలుగు ఊళ్లని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఆ పేరుకి బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ నాలుగు ఊళ్ల అవసరాల కోసం దేవర (ఎన్టీఆర్‌), తన దోస్తులు రాయప్ప(శ్రీకాంత్), భైరా (సైఫ్ అలీఖాన్), కుంజ (కళయరసన్), కోర (షేన్ చామ్ టాకో) తో కలిసి పెద్ద పెద్ద షిప్స్ నుంచి మురుగా (మురళి శర్మ) కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు.  ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటుంది మురుగ గ్యాంగ్. సముద్రానికి  ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తున్నాయని గ్రహించిన దేవర ఇకపై ఆ పనుల్ని చేయకూడదనే నిర్ణయానికొస్తాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, చేపలు పట్టడంపై దృష్టి పెడదామని చెబుతాడు. భైరా అందుకు ఒప్పుకోడు. కానీ ఎర్రసముద్రంలో దేవర మాటే శాసనం. తన వాళ్ల కోసం ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం, ప్రాణాలు తీసేంత దైర్యం రెండు ఉంటాయి దేవరకు. చిన్నప్పుడే సొర చేపను చంపి ఒడ్డుకు తెచ్చేంత తెగువున్న దేవరకి ఎదురుచెప్పలేక దేవర గ్యాంగ్ కూడా దొంగతనాలకోసం మళ్లీ సముద్రం మీదకు వెళ్ళటం మానేస్తారు. కానీ ఈ విషయంలో దేవర చేసే పనులు భైరాకు నచ్చవు. కానీ దేవర సాయం లేకుండా ఏం చేయలేం అని భైరా అదును కోసం చూస్తుంటాడు. తనవారిని దేవర ఏం చెప్పి భయపెట్టాడు? దేవర ఎలాంటి నిర్ణయం  తీసుకున్నాడు? అందరినీ భయపెట్టే దేవర కొడుకు వరా (రెండో ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారతాడు? వరాను పెళ్లి చేసుకునేందుకు తంగం(జాన్వీ కపూర్) ఏం చేసింది?  దేవరకి బైరాకి వైరం ఎందుకు మొదలైంది?  చివరికి శివంకి యతి దొరికాడా? లేదా? తెలియాలంటే సినిమా థియేటర్స్ లో చూడాల్సిందే. 


విశ్లేషణ: 
ఎలాంటి భావోద్వేగాన్ని అయినా అద్భుతంగా పండించే ఎన్టీఆర్ ని కొరటాల అద్భుతంగా వాడుకున్నారు. దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ జీవించాడు. సినిమా మొదటి నుంచి, చివరి వరకు దేవర ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. దేవర్లో కూడా కొరటాల మార్క్ యాక్షన్ సీక్వెన్సులు, హీరో ఎలివేషన్ లు సూపర్ గా ఉన్నాయి. దేవరలో ఓ ఐడియాలజీ ఉంది. దేవర  సినిమా మొదలుపెట్టినప్పుడే ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అని 'ఫర్ గాటెన్ ల్యాండ్స్' ని ఆధారంగా చేసుకుని చేస్తున్న సినిమా అని స్పష్టం చేసారు కొరటాల. అదే నిజమని అనిపించేలా సినిమా ఉంది. లేని ఒక ప్రాంతాన్ని సృష్టించి తన కథకు కావాల్సిన పరిస్థితిని సెట్ చేసుకున్నారు. యతిని అన్న వ్యక్తి కోసం పోలీసులు రావటం, ఆ వ్యక్తికి సంబంధం లేని మరో వ్యక్తి గురించి చెప్పటంతో కథ మొదలవుతుంది. ప్రకాష్ రాజ్ ద్వారా దేవర ఎవరు? అతని నేపథ్యం? సడెన్ గా  దేవర తీసుకున్న నిర్ణయం, అన్ని ఆసక్తి కలిగించేలా చెప్పించాడు. ప్రీ ఇంటర్వెల్ సూపర్ గా ప్లాన్ చేసాడు. దేవర డైలాగ్స్ తో, యాక్షన్ తో సినిమాని ఎలివేట్ చేసే విధానం బాగుంది. 


ఫస్ట్ హాఫ్ లో తండ్రి దేవర క్యారక్టర్ ని హైలెట్ చేసి, సెకండ్ హాఫ్ లో కొడుకు వరా పాత్రని తీర్చి దిద్దాడు. వరా కి జోడిగా తంగం చేసిన అల్లరి, రొమాన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తంగం, వరా మధ్య వచ్చే పాటల్లో డాన్స్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో టైగర్ లాంటి ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ చూసిన ఫాన్స్ కి సెకండ్ హాఫ్ లో వర భయస్తుడిగా ఉండటాన్ని కొంచెం రిసీవ్ చేసుకోలేరు. కానీ వర పాత్ర ఎందుకు అలా ఉంటుందో తెలిసాక రియలైజ్ అవుతారు. క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ లీడ్ ని మంచి ఇంట్రెస్టు గా ముగించారు.  


నటీ నటులు:
దేవర, వర లాంటి రెండు భిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ జీవించేసాడు. దేవర పాత్రలో ఎన్టీఆర్ ఆహార్యం, భావోద్వేగాలు, యాక్షన్ సీన్స్ లో యాంగ్రీ నెస్  సినిమాని హై రేంజ్ లో నిలబెట్టాయి. RRR  మూవీ తరవాత ఎన్టీఆర్ కి ఆ స్థాయి పేరు తెచ్చి పెట్టే సినిమా అవుతుంది దేవర. గ్లోబల్ స్టార్  బిరుదుకి న్యాయం చేసేలా ఉంది ఎన్టీఆర్ యాక్షన్.  ఎన్టీఆర్ తరవాత చెప్పుకోవాల్సిన పాత్ర సైఫ్ ఆలీఖాన్. బైరా పాత్రలో సైఫ్ నటన అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ కి ధీటుగా ఉంది బైరా పాత్ర. ఎన్టీఆర్ కి సమ ఉజ్జినీ ఎంచటంలో కొరటాల హండ్రెడ్ పర్శంట్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.  జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది. తంగం పాత్రలో కనిపించిన జాన్వీ ఉన్నంత వరకు బాగానే అనిపించింది. స్క్రీన్ ప్రెజెన్సీ బాగుంది. నటన, డాన్స్ ల్లో ఎన్టీఆర్ తో పోటీ పడింది.  ప్రకాష్ రాజ్, కళయరసన్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, శృతి మరాఠీ, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ వారి పాత్రల పరిధి మేరకు నటించారు. ఈ సినిమాలో ఎక్కువ క్యారక్టర్స్ ఉండటం, వారి పేర్లు గుర్తు పెట్టుకోవటం కొంచెం కష్టమే. 


టెక్నికల్ :
దేవర సినిమాని పాన్ ఇండియా మూవీగా అలరించేందుకు దర్శకుడు తీసుకున్న శ్రద్ద కనిపిస్తోంది. ఎన్టీఆర్ పాత్రని తీర్చి దిద్దిన విధానం బాగుంది. టోటల్ గా ఎన్టీఆర్ ఫాన్స్ కి కొరటాల ఫుల్ మీల్స్ పెట్టారు. కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్ గా ఉంటూ సోషల్ మెసేజ్ కూడా ఇచ్చే విధంగా ఉంటుంది. దేవరలోనూ ఇదే సూత్రాన్ని అమలు చేసాడు కొరటాల. ప్రతీ మనిషికి భయం ఉంటుంది, ఉండాలి. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదనేది దేవర మెసేజ్. యాక్షన్ సీక్వెన్సులు, అండర్ వాటర్ సీక్వెన్సులు ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా చిత్రించారు దర్శకుడు. కొరటాల డైరెక్షన్స్  ప్రత్యేకతలన్నీ దేవరలో పక్కాగా కనిపిస్తాయి. శివ మాటలు, కథా రచన, భావోద్వేగాలు ఆడియన్స్ ని అలరిస్తాయి. ‘దేవర అడిగినాడంటే సెప్పినాడని, సెప్పినాడంటే..’  ‘భయం పోవాలంటే దేవుడి కథ వినాల, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాల..’, ‘సంద్రం ఎక్కాల, ఏలాల’ లాంటి డైలాగ్స్ హీరో ఇజాన్ని బాగా ఎలివేట్ చేస్తాయి. అనిరుధ్ మ్యూజిక్ ఈ మూవీకి కలిసొచ్చింది. పాటల్లో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో అనిరుద్ మెప్పించాడు.  రత్నవేలు సినిమాటోగ్రఫి మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మ్యూజిక్, కెమెరా వర్క్ సినిమాని ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. సముద్ర తీరం, కొండలు, అటవీ ప్రాంతాన్ని రత్నవేలు  కెమెరా సుందరంగా చిత్రించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.   


ప్లస్ పాయింట్స్ 
ఎన్టీఆర్ 
సైఫ్ ఆలీఖాన్ 
అనిరుద్ మ్యూజిక్ 
సినిమాటోగ్రఫీ 


మైనస్ పాయింట్స్ 
నిడివి 
స్లో నెరేషన్ 
హీరోయిన్ పాత్ర  


ఫైనల్ వర్దిక్ట్:  దేవర... యాక్షన్ అదిరింది కానీ....

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS