ఎన్టీఆర్ తో మరోసారి సై అంటున్న కొరటాల శివ

By iQlikMovies - August 01, 2018 - 18:26 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి రికార్డులు సృష్టించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం కొరటాల శివ.. చిరంజీవి కోసం ఒక కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఇక ఆ చిత్రం తరువాత చేయబోయే చిత్రానికి సంబంధించి హీరోని ముందుగానే ఎంపిక చేసుకున్నట్టుగా తెలిసింది. ఆ హీరో మరెవరో కాదు ఎన్టీఆర్.

జనతా గ్యారేజ్ చిత్రం చేస్తున్న సమయం నుండే వీరి మధ్య చాలా విషయాల్లో ఒకే అభిప్రాయం ఉండేది అని అదే ఆ తరువాత స్నేహంగా కూడా మారిందట. దీనితో మరోసారి వీరిరువురు కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తున్నది.

అయితే ఈ చిత్రం ప్రారంభానికి మాత్రం చాలా సమయమే ఉంది అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS