ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఈ మధ్యే తమిళ, హిందీ భాషల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సో ఈ ముద్దుగుమ్మ సో బిజీ అన్న మాట. అరదుకే అమ్మడికి ప్రేమించేందుకు అస్సలు టైం దొరకడం లేదట. అందుకే ఇంతవరకూ ప్రేమలోనే పడలేదట. లవ్ ఇష్యూ నుండి ఈ చిన్నది భలే తప్పించేసుకుంది కదా. అలాగే రకుల్‌కి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏమీ లేవట. అంటే డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివన్న మాట. స్మోకింగ్ అంటే అస్సలు ఇష్టం లేదట ఎందుకంటే సిగరెట్ టేస్ట్ అంత బాగుండదనీ ఆమె ఫీలింగ్ అట. అలాగే డ్రింకింగ్ చేయాల్సిన అవసరం కూడా తనకి లేదంటోంది. అలాగే టాలీవుడ్‌లో డ్రగ్స్ ఇష్యూ కలకలం రేపిన సంగతి తెలిసిందే. దానిపై కూడా ఈ ముద్దుగుమ్మ స్పందించింది. గతంలోనే స్పందించింది. అయితే తాజాగా తనతో ఇంతవరకూ పని చేసిన ఆర్టిస్టులెవరికీ డ్రగ్స్‌తో సంబంధాలు లేవనీ, అలాంటి అలవాట్లు లేవనీ రకుల్ డిక్లర్ చేసేసింది. ఈ ముద్దుగుమ్మ 'జయ జానకి నాయకా' సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో నటిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే మహేష్‌బాబుతో 'స్పైడర్' సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానుంది.