నెక్స్‌ట్‌ సినిమా పనుల్లో ఎన్టీఆర్‌ బిజీగా ఉండడం నిజమేనా?

మరిన్ని వార్తలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే బల్గేరియాలో భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని వచ్చిన ఎన్టీఆర్‌ తదుపరి షెడ్యూల్‌ కోసం ప్రిపేర్‌ కానున్నాడు. ఇదిలా ఉంటే, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నెక్స్‌ట్‌ చేయబోయే సినిమా ఏంటీ.? అనే అంశమై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది టాలీవుడ్‌లో. ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు చాలా మంది డైరెక్టర్లు లైన్‌లో ఉన్నారు. లైన్‌లో ఉన్న డైరెక్టర్స్‌ అందరూ చేతిలో ఒక్కొక్క సినిమాతో ప్రస్తుతం ఎన్టీఆర్‌లాగే బిజీగా ఉన్నారు.

 

ఎన్టీఆర్‌ ఫ్రీ అయ్యే సమయానికి వారు కూడా ఒక్కొక్కరుగా తమ తమ ప్రాజెక్టుల నుండి ఫ్రీ అవ్వనున్నారు. సో వారిలో ఎన్టీఆర్‌ ఎవరిని సెలెక్ట్‌ చేసుకుంటాడన్నదే ఇప్పుడు ఆడియన్స్‌లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎన్టీఆర్‌ లిస్టులో ఉన్న డైరెక్టర్స్‌ ఎవరంటే, మొదటి వరసలో త్రివిక్రమ్‌, కొరటాల శివ ఉన్నారు. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ వంటి సెన్సేషనల్‌ డైరెక్టర్లు కూడా ఉన్నారు. కానీ, ఎన్టీఆర్‌ మాత్రం త్రివిక్రమ్‌, కొరటాల శివల్లో ఎవరో ఒకరిని సెలెక్ట్‌ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌ నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' జూలై 30న విడుదల కానుంది. సో బన్నీతో సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ సినిమాకి స్క్రిప్టు సిద్ధం చేస్తాడనేది తాజా సమాచారం.

 

ఇక కొరటాల విషయానికి వస్తే, ఆయన చిరుతో సినిమా తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం చిరు 'సైరా' పనుల్లో బిజీగా ఉండడంతో, ఇంకా ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లలేదు. ఈ సినిమా పట్టాలెక్కించిన తర్వాత కొన్ని నెలల సమయం తీసుకుంటుంది. సో ఎన్టీఆర్‌కి, సైమల్‌టైనియస్‌గా అందుబాటులో ఉండే డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ అనిపిస్తోంది. సో త్రివిక్రమ్‌తోనే ఎన్టీఆర్‌ తదుపరి చిత్రం ఉండొచ్చని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్‌ ఏం యోచన చేస్తున్నాడో తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS