టైటిల్ విదాదం మధ్య చిక్కుకుని, చివరికి `గద్దలకొండ గణేష్` గా పేరు మార్చుకుని వచ్చింది `వాల్మీకి`. జిగడ్తాండకి రీమేక్ ఇది. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. `ఇస్మార్ట్ శంకర్` తరవాత బాక్సాఫీసు ముందుకొచ్చిన మాస్ సినిమా ఇదే కాబట్టి - తొలి రోజు వసూళ్లు కమ్మేశాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ దాదాపు రూ.5.5 కోట్లు తెచ్చుకుంది. ఎఫ్ 2ని మినహాయించి చూస్తే, వరుణ్‌తేజ్ కెరీర్లో ఇదే రికార్డు. నైజాంలో 1.63 కోట్లు వచ్చాయి.
సీడెడ్‌లో రూ.82 లక్షలు, గుంటూరులో 71 లక్షలు వసూలు చేసింది. ఈస్ట్, వెస్ట్ కలిపి 1.10 కోట్లు తెచ్చుకుంది. వైజాగ్‌లో 70 లక్షలు వసూలు చేసింది. మొత్తానికి తొలి రోజు వసూళ్లు సంతృప్తికరంగానే సాగాయి. గద్దలకొండకు పోటీగా వచ్చిన `బందోబస్త్` కి ఫ్లాఫ్ టాక్ రావడం, గ్యాంగ్ లీడర్ హవా తగ్గడం `గద్దల కొండ`కు ప్లస్ పాయింట్లు. సో.. శని, ఆదివారాల్లోనూ ఈ జోరు కొనసాగే అవకాశాలున్నాయి.