ఆ డైరెక్టర్‌కి సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా?

By Inkmantra - September 21, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ' గ్రాండ్‌ రిలీజ్‌ ఓ పక్క, బాలయ్య వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' మరో పక్క రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్న తరుణంలో నేనేం తక్కువ కాదు అంటూ 'శతమానం భవతి' సినిమాని విడుదల చేసే సాహసం చేశాడు డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న. అప్పటి వరకూ ఆయన చేసిన సినిమాలు చిన్న చిన్న సినిమాలే. 'దొంగల బండి' తరహాలో. 'శతమానం భవతి'తో ఈ డైరెక్టర్‌ దశ తిరిగింది. స్టార్‌ హీరోల సినిమాలతో పాటు, ఈ సినిమాకీ కలెక్షన్ల వర్షం కురిసింది ఆ ఏడాది సంక్రాంతికి.

 

శర్వానంద్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా తెరకెక్కింది ఈ సినిమా. ఆ తర్వాత నితిన్‌తో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా తెరకెక్కించాడు సతీష్‌ వేగేశ్న. కానీ, కలిసి రాలేదు. ఇప్పుడు 'ఎంత మంచి వాడవురా' అనే సినిమాతో వస్తున్నాడు. నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాని సంక్రాంతి రేస్‌లో దించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న.

 

లేటెస్ట్‌గా కళ్యాణ్‌రామ్‌ ఈ విషయాన్ని కన్‌ఫామ్‌ చేసేశాడు కూడా. 'ఎంత మంచి వాడవురా' సినిమా నుండి ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ, సంక్రాంతికి కలుద్దాం..' అని ఫ్యాన్స్‌కి హింట్‌ ఇచ్చేశాడు. కళ్యాణ్‌రామ్‌ '118'తో హిట్‌ కొట్టి జోష్‌ మీదున్నాడు. ఇక డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్నకు సంక్రాంతి సెంటిమెంట్‌ కలిసొచ్చి 'ఎంత మంచివాడవురా' మంచి హిట్‌ అవుతుందా.? వేచి చూడాలిక. ఇక ఈ సంక్రాంతికి బన్నీ 'అల వైకుంఠపురములో', మహేష్‌ 'సరిలేరు నీకెవ్వరు..' వంటి పెద్ద సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS