నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న 'జై లవ కుశ' సినిమా, నిర్మాతగా ఆయనకీ, హీరోగా ఎన్టీయార్‌కీ కెరీర్ బెస్ట్ హిట్ అందించేలా ఉంది. సినిమా అనుకున్నప్పటి నుండీ ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. అయితే సినిమాకి సంబంధించి ఓ హాట్ న్యూస్. ఎలా జరిగిందో తెలీదు కానీ ఈ సినిమా టీజర్ లీక్ అయ్యింది. ఈ కారణంగా నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్ కలత చెంది, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు కూడాను. ఇంకో వైపున లీకైన టీజర్లో ఎన్టీయార్ సూపర్బ్‌గా ఉన్నాడనే రివ్యూస్ వస్తున్నాయి. టీజర్ రివ్యూస్‌లో ఎన్టీయార్ కెరీర్ బెస్ట్ లుక్ అండ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని అనుకుంటున్నారు. టీజర్ లీక్ అయితే అయ్యింది కానీ, ఇది సినిమాపై హైప్ ఇంకా పెంచడానికి ఉపయోగపడుతుందనడం నిస్సందేహం. తొలిసారిగా ఎన్టీయార్ ఈ సినిమా కోసం త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసినదే కదా. రాశి ఖన్నా, నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ప్రేమకథా చిత్రమ్' ఫేమ్ నందిత ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నారు. ఇందులోని మూడు పాత్రల్లో ఒకటి ఎన్టీయార్ నెగెటివ్ టచ్‌తో చేస్తున్నది అని తెలుస్తోంది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా ఆశక్తితో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. నెగిటివ్ రోల్లో ఎన్టీఆర్ ఎలా నటించబోతున్నాడనేది ఆశక్తిగా మారింది. దసరాకి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.