'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమవ్వాలనుకుని నిర్ణయించుకున్నారన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమవ్వడం ఫ్యాన్స్‌తో పాటు చాలా మందికి ఇష్టం లేదు. అందుకే ఒకరి తర్వాత ఒకరుగా పవన్‌కి సలహాలు ఇస్తున్నారట. ఇటు సినిమాల్లో ఉంటూనే, రాజకీయాల్లో కూడా కొనసాగమనీ పవన్‌కి సూచిస్తున్నారట.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్‌ని సినిమాల్లో కొనసాగమని హితబోధ చేశారట. సినీ గ్లామర్ రాజకీయాలకి కలిసొస్తుందనీ అన్నయ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కి చెప్పారట. దాంతో అన్నయ్య చెప్పిన మాటతో తమ్ముడు పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడ్డాడనీ తెలుస్తోంది. దాంతో మళ్లీ సినిమాలు చేయాలనే నిర్ణయానికి పవన్ వచ్చాడనీ సమాచారమ్. 2019 ఎలక్షన్స్‌లోపే ఓ సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడనీ తెలుస్తోంది. చిరంజీవి, ఇతర సన్నిహితులు చెప్పిన సలహాల ప్రకారం పవన్ కళ్యాణ్ ఒకవేళ సినిమా చేయాల్సి వస్తే, వీలైనంత త్వరలోనే అది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై అతి త్వరలోనే పవన్ క్లారిటీ ఇవ్వనున్నాడట.
ఇకపోతే, పవన్ సినిమా చేయాలనుకుంటే, పలువురు దర్శక, నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఇక డెసిషన్ మాత్రం పవన్‌దే. ఇప్పటికే రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తూ, మైత్రీ మూవీస్ సంస్థ పవన్ కోసం సినిమా చేయాలనే యోచనలో ఉంది. ఇక డైరెక్టర్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు. యంగ్ డైరెక్టర్స్ నుండి, సీనియర్ డైరెక్టర్స్ వరకూ ఆ మాటకొస్తే తమిళ డైరెక్టర్స్‌తో సహా పవన్ మాట కోసం ఎదురు చూస్తున్న వారే.