ఎన్టీఆర్‌తో చరణ్‌ ఆ కిక్కే వేరప్పా.!

By iQlikMovies - June 09, 2018 - 18:42 PM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరన్‌ తేజ్‌ ఓ సినిమా చేయడం ఓ అద్భుతంగానే చెప్పుకోవాలి. నిఖార్సయిన మల్టీస్టారర్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ సినిమాలో స్టార్లు ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు. హీరోల్ని మించి స్టార్‌ డమ్‌ సంపాదించుకున్న జక్కన్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు మరి. 

ఆ సంగతి పక్కన పెడితే, చరణ్‌ - ఎన్టీఆర్‌ ఎప్పటినుండో మంచి స్నేహితులు. బావా బావా అని పిలుచుకుంటారు. సినిమాటిక్‌ ఈక్వేషన్స్‌ కారణంగా అభిమానులే కొంత గందరగోళం సృష్టిస్తుంటారు. ఇకపై ఏ హీరో అభిమాని కూడా ఇతర హీరోలపై దురభిమానం చాటకుండా, తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు ఒకరితో ఒకరు స్నేహ పూర్వకంగా ఉంటున్నారు. 

తామెలా కలిసుంటున్నామో అభిమానులు కూడా అలాగే కలిసుండాలని పిలుపు నిస్తున్నారు. చరణ్‌, ఎన్టీఆర్‌ రాజమౌళితో చేయబోయే సినిమా ద్వారా ఇటు మెగా అభిమానులకి, అటు నందమూరి అభిమానులకు సూపర్బ్‌ మెసేజ్‌ ఇస్తున్నారనీ అభిమానుల్లోనే చర్చ జరుగుతోంది. 

ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌ ఏంటంటే, సిక్స్‌ ప్యాక్‌కి సంబంధించి చరణ్‌, ఎన్టీఆర్‌కి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాడట. బాడీ ఫిట్‌నెస్‌ విషయంలో చరణ్‌ సినిమాల్లోకి రావాలనుకున్నప్పటి నుండే ఖచ్చితమైన అవగాహనతో ఉన్నాడు. అయితే ఎన్టీఆర్‌ మొదట్లో బొద్దుగా ఉండేవాడు. ఇప్పుడు కిర్రాక్‌ పుట్టిస్తున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS