'భరత్' సినిమా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. ఇటీవలే తమిళ వెర్షన్ కూడా విడుదలైంది. మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. అయితే భరత్ మీద నెగిటివ్ ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. 95 కోట్లుకు పైన షేర్ వసూలు చేసిన 'భరత్ అనే నేను' గ్రాస్ పరంగా 200 కోట్లు ఎప్పుడో దాటేసింది. అయితే అదంతా ఫేక్ అని కొందరు సోషల్ మీడియా వేదికగా 'భరత్' మీద అక్కసు వెల్లగక్కుతున్నారు.
ఇది మహేష్ అభిమానుల్ని కలచి వేస్తోంది. వంద కోట్ల క్లబ్‌లోకి (షేర్ ) భరత్ చేరిపోయాడనీ అభిమానులు బల్ల గుద్ది చెబుతున్నారు. ఎన్ని కోట్లు సాధించింది అన్న విషయం పక్కన పెడితే, 2018లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్‌లో 'భరత్' కూడా ఒకటి అనే విషయం మర్చిపోకూడదు. వసూళ్ల లెక్కల పరంగా చరణ్ ముందున్నాడు. 'భరత్' రెండో స్థానంలో ఉన్నాడు. ఇదీ ఈ ఏడాది తొలి ఐదు నెలల రిపోర్ట్ సారాంశం.
నిజానికి మహేష్ అంటే గిట్టని వారు చాలా తక్కువ మందే ఉంటారు. 'భరత్' సినిమాతో ఎందుకో మహేష్ దురభిమానుల్ని సంపాదించుకున్నాడేమో అనిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.