దూకుడు పెంచేసిన మెగా పవర్‌స్టార్‌.!

By iQlikMovies - August 14, 2018 - 14:43 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అనే కన్నా, 'చిట్టిబాబు' అని ముద్దుగా పిలుచుకోవడం ఇప్పుడు సరదా అయిపోయింది మెగా అభిమానులకు. అంతలా ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్‌ని అభిమానుల్లోనే కాదు, ఆల్‌ ఆడియన్స్‌లో కలిగించేశాడు 'రంగస్థలం' సినిమాతో చిట్టిబాబుగా రామ్‌చరణ్‌. 

వసూళ్ల రాజాగా బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించిన ఈ మెగా హీరో తదుపరి చిత్రం మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'రంగస్థలం' బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఈ సినిమాపై భారీ నుండి అతి భారీ అంచనాలు నమోదయ్యాయి. ఆల్రెడీ మొదటి షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ కోసం హైద్రాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్‌కి దుకాణం సర్దేసుకోనుంది. ఈ సినిమాలో చాలా చాలా ప్రత్యేకతలున్నాయి. బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ని ఈ సినిమాలో విలన్‌గా చూడబోతున్నాం. 

అలాగే ఎప్పుడో మర్చిపోయిన, తెలుగు వారికి అత్యంత సుపరిచితుడైన తమిళ హీరో లవర్‌బోయ్‌ ప్రశాంత్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆర్యన్‌ రాజేష్‌ లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఓ విభిన్న తరహా క్యారెక్టర్‌ పోషిస్తున్నాడీ సినిమాలో. ఈ సినిమాకి 'రాజవంశస్థుడు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 

ప్రస్తుతానికి ఈ సినిమా కథా కమామిషు ఏంటనే విషయంలో సరైన స్పష్టత లేనప్పటికీ, పక్కా మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని మాత్రం తెలుస్తోంది. 'భరత్‌' బ్యూటీ కైరా అద్వానీ ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా నటిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS