'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో 'ప్రేమమ్‌' బ్యూటీ.!

మరిన్ని వార్తలు

'ప్రేమమ్‌' సినిమాతో తెలుగు తెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్, ఆ తర్వాత తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. అందుకు కారణం అమ్మడికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడమంటేనే ఇష్టమట. వరుస సినిమాల్లో బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా నటించేసి, ఫ్లాపులు వెనకేసుకోవడం ఇష్టం లేదట. అందుకే లేట్‌ అయినా లేటెస్టుగా వచ్చి, బెస్ట్‌గా రిజిస్టర్‌ అయిపోవాలనే ఉద్ధేశ్యం ఈమెది. అందుకే ఇన్నాళ్లు గ్యాప్‌ తీసుకుంది. 

అయితే మలయాళంలో సినిమాలు చేస్తోందిలెండి. ఇకపోతే ప్రేమమ్‌ సినిమానే తీసుకుంటే, ఆల్‌మోస్ట్‌ సినిమాకి క్లైమాక్స్‌లో వచ్చి తన పాత్ర తాలూకు ముద్రల్ని కథపై బలంగా ముద్రించేసింది మడోనా. అదీ ఆమె ఆటిట్యూడ్‌. బేసిగ్గా మంచి టాలెంట్‌ ఉన్న అమ్మాయి. యాక్టింగ్‌ టాలెంట్‌తో పాటు ఇతరత్రా వ్యాపకాలు కూడా ఉన్నాయి ఈ అందాల భామకి. 

సింగింగ్‌లో మడోనా టాలెంట్‌ గురించి గతంలోనే మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడెందుకు ఈ భామ గురించి మాట్లాడుకోవల్సి వస్తుందంటే, టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత గాధ అయిన 'ఎన్టీఆర్‌' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోందట. 

అదేంటంటే, నారా భువనేశ్వరి పాత్ర. ఈ బయోపిక్‌కి నారా చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతో కీలకమైనది. ఆయన భార్య అయిన భువనేశ్వరి పాత్రకు కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్‌ ఉండనే ఉంటుంది. సినిమాలో ఆ పాత్ర కోసం ఈ ముద్దుగుమ్మని ఎంచుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. శ్రీ నారా చంద్రబాబునాయుడు పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ పాత్ర చిత్రీకరణ ఇటీవల మొదలైంది కూడా. చూడాలి మరి, నారా భువనేశ్వరిగా మడోనా మరోసారి ఎలాంటి ముద్ర వేస్తుందో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS