యంగ్‌ టైగర్‌ చూపిస్తాడా? లేదా?

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌ తన తాజా చిత్రం కోసం జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్నాడు. ఇప్పటికే బరువు తగ్గి, స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. విదేశీ ట్రైనర్‌ స్టీవ్‌ పర్యవేక్షణలో ఎన్టీఆర్‌ కసరత్తులు చేస్తూ సిక్స్‌ ప్యాక్‌ బాడీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదంతా ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ సినిమా కోసమే అంటూ ఇన్నాళ్లుగా ప్రచారం జరిగింది. 

అయితే తాజా అప్‌డేట్‌ ఏంటంటే, ఎన్టీఆర్‌ కసరత్తులు, త్రివిక్రమ్‌ సినిమా కోసం కాదట. రాజమౌళి సినిమా కోసమట. రాజమౌళి, చరణ్‌ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ మల్టీ స్టారర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరక్కెనుంది. ఈ సినిమా కోసమే ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌లో కనిపించనున్నాడనీ సమాచారమ్‌. అంటే ఎన్టీఆర్‌ తన సిక్స్‌ ప్యాక్‌ బాడీని చూపించేందుకు చొక్కా విప్పేది మాత్రం రాజమౌళి సినిమా కోసమేనట. అయితే త్రివిక్రమ్‌ సినిమాలో కూడా ఎన్టీఆర్‌ సన్నగానే కనిపిస్తాడు. కానీ జస్ట్‌ ఫిట్‌గా కనిపిస్తాడంతేనట. సిక్స్‌ ప్యాక్‌ షో అయితే లేదంటున్నాడు. 

ఇదంతా త్రివిక్రమ్‌తో సినిమాకి కమిట్‌ అయ్యే ముందే ఎన్టీఆర్‌ ప్లాన్‌ చేశాడట. 'జై లవకుశ' సినిమా తర్వాత ఎన్టీఆర్‌ వరుసగా ఈ రెండు చిత్రాల్లోనూ నటించనున్నాడు. త్రివిక్రమ్‌ సినిమా కొద్దిరోజుల్లోనే పట్టాలెక్కనుండగా, ఆ తర్వాత రాజమౌళి సినిమా కూడా షురూ కానుంది. మరో పక్క చరణ్‌ 'రంగస్థలం' గెటప్‌ తీసేసి, బోయపాటి సినిమా కోసం స్టైలిష్‌ లుక్‌లోకి మారిపోయాడు. అలా చరణ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ ఈ రెండు సినిమాలను సైమల్టేనియస్‌గా పూర్తి చేసే యోచనలో ఉన్నారన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS