రంగస్థలం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది...

By iQlikMovies - March 29, 2018 - 18:59 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాకి సంబందించిన తొలి రివ్యూ వచ్చేసింది. దుబాయ్ కి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఈ సినిమాని వీక్షించి దానికి సంబంధించిన రివ్యూ ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు.

ఈ రివ్యూ లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ సమంతా అలాగే విలన్ జగపతిబాబుల నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. అలాగే రత్నవేలు ఛాయాగ్రహణం, దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి స్పెషల్ గా చెప్పాడు. ఈ సినిమాకి రేటింగ్ 3.5/5 కూడా ఇచ్చేసాడు. ఈ తరుణంలో ఈ సినిమా పైన ఇప్పటికే ఉన్న అంచనాలు పదింతలయ్యాయి.

ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా విడుదలకి ముందు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రేపు ఉదయమే తొలి షో చూడడానికి ప్రేక్షకులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో టికెట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా పన్నెండు గంటల తరువాత ఈ చిత్రానికి సంబందించిన టాక్ బయటకిరానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS