యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువనిచ్చే వ్యక్తో అందరికీ తెలుసు. తాజాగా దర్శకుడు సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ లో నిర్మించబడిన దర్శకుడు చిత్రం టీజర్ రిలీజ్ వేడుక జరిగింది.
దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిధి గా వచ్చాడు. అయితే ఈ ఈవెంట్ లో అందరు ఆయనను టీజర్ విడుదల చేయడానికి ఒప్పుకున్నందుకు పొగడ్తలతో ముంచెత్తారు. దీనితో ఎన్టీఆర్ మాట్లాడుతూ- దయచేసి నన్ను వేరు చేయకండి, సుకుమార్ నా మనసుకి చాలా దగ్గరయినవాడు. అలాగే తన కోసం చేసేది ఏదైనా బరువుగా అనుకోను అది బాధ్యత గానే చూస్తాను అని చెప్పాడు.
ఇక అదే సమయంలో సుకుమార్ మాట్లాడుతూ- ఎన్టీఆర్ చేసిన ఒక ట్వీట్ వల్లనే కుమారి 21F కి అంత హైప్ వచ్చిందని అలాగే ఇప్పుడు దర్శకుడు చిత్రం టీజర్ లాంచ్ చేసాడు కాబట్టి, దీనికి కూడా ఆటోమేటిక్ గా హైప్ వస్తుందని చమత్కరించాడు.