తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ, స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన శృతిహాసన్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. 'కాటమరాయుడు' సినిమా తర్వాత శృతి తెలుగు సినిమాల్లో నటించలేదు. అంతంత మాత్రంగా ఉన్న శృతి కెరీర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో 'గబ్బర్ సింగ్' సినిమా చేయడంతో గాడిన పడింది. ఆ సినిమా తర్వాత శృతిహాసన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్స్ మీద హిట్స్ అందుకుని, టాప్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది.
అయితే 'కాటమరాయుడు' సినిమాతో అమ్మడి దశ మళ్లీ రివర్స్ అయిపోయింది. ఆ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో మళ్లీ తెలుగులో సినిమా ఛాన్స్ రాలేదు శృతిహాసన్‌కి. అయితే ఛాన్స్ రాకపోవడం కాదు, తానే కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నానంటోంది శృతిహాసన్. ఈ గ్యాప్‌లో శృతిహాసన్ మీద బోలెడన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. శృతిహాసన్ తన బోయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోబోతోందనీ, అందుకే సినిమాలకు దూరంగా ఉందనీ, కాదు కాదు, తండ్రితో రాజకీయాల్లో బిజీ కానుందనీ, అందుకోసమే సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదనీ ఇలా పలు రకాల గాసిప్స్ చక్కర్లు కొట్టాయి.
అయితే వీటిన్నింటికీ, ఈ ముద్దుగుమ్మ చెక్ పెట్టేసింది. త్వరలోనే తన కొత్త సినిమా డీటెయిల్స్ చెబుతానంటోంది. రవితేజతో శృతిహాసన్ కొత్త సినిమాకి పచ్చజెండా ఊపిందని తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. అయితే అఫీషియల్‌గా ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయట. గతంలో రవితేజతో 'బలుపు' చిత్రంలో శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే.