మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్‌పై 'అజ్ఞాతవాసి'తో పడిన ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. ఎంతగా మర్చిపోదామనుకున్నా, నీడలా వెంటాడేస్తోందది త్రివిక్రమ్‌ని. ఆ సినిమా తర్వాత వెంటనే చేస్తున్న ఎన్టీఆర్ సినిమాపై మరింత కేర్ తీసుకునేలా ఆ ఎఫెక్ట్ పెను భారంగా మారింది.
ఇకపోతే అత్యంత బరువైన టైటిల్‌ని ఈ సినిమాకి ఎంచుకున్నాడు త్రివిక్రమ్. 'అరవింద సమేత వీర రాఘవ' అని. పవన్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అత్తారింటికి దారేది' తరహాలోనే ఈ టైటిల్ ఉండడంతో పాటు, త్రివిక్రమ్ ఎంచుకుంటున్న కాస్టింగ్ దృష్ట్యా కూడా ఆడియన్స్ ఆ సినిమాకే ఆపాదించుకుంటున్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రంలో ముద్దుగుమ్మ ప్రణీత సెకండ్ హీరోయిన్‌గా నటించింది. అదే తరహాలో ఇప్పుడు ఈషా రెబ్బని ఓ క్యారెక్టర్ కోసం ఎంచుకున్నాడు 'అరవింద సమేత..'లో. ఎన్టీఆర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని ప్రచారం జరుగుతోంది. అందులో కూడా సాప్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రే పవన్‌ది.
ఇలా ఒక్కటి కాదు, చాలా రకాల కంపేరిజన్స్ చర్చకు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాతో తన కెరీర్‌పై పడిన అతి పెద్ద మచ్చని చెరుపుకుని, 'అత్తారింటికి దారేది' స్థాయిలో బిగ్ హిట్ కొట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అంతగా ఆలోచించి, ఆలోచించి ఒకవేళ త్రివిక్రమ్ మళ్లీ 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని ఎన్టీఆర్‌తో కానీ రీమేక్ చేయడం లేదు కదా.. అని విమర్శలు వస్తున్నాయి.
ఏమో త్రివిక్రమ్ ఈ సినిమాతో ఏం చేస్తాడో చూడాలిక. 'టెంపర్' నుండి 'జనతా గ్యారేజ్' వరకూ వరుస హిట్స్‌లో ఉన్న ఎన్టీఆర్ బండికి 'జై లవకుశ'తో కాస్త బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. ఆ దిశగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విషయంలో కొంచెం కేరింగ్‌గానే ఉన్నాడట.