ఎన్టీఆర్-త్రివిక్రమ్ చేస్తారా? చేయరా?

By iQlikMovies - April 14, 2018 - 09:37 AM IST

మరిన్ని వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న చిత్ర షూటింగ్ ఈమధ్యనే షురు అయింది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఒక షూటింగ్ స్టిల్ విడుదల చేస్తూ దాని పైన 2018 దసరాకి విడుదల చేస్తున్నట్టుగా తెలిపాడు.

దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఆనందం అయితే ఉప్పోగింది కాని సగటు ప్రేక్షకుల్లో మాత్రం కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. అదెలాగంటే, ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల చిత్రం షూటింగ్ కి తగినంత సమయంలేదు అనేది ప్రధాన అనుమానం.

సాధారణంగా త్రివిక్రమ్ తన చిత్రాల చిత్రీకరణకి ఎక్కువ సమయం తీసుకుంటుంటాడు అట్లాంటిది ఈ చిత్రాన్ని ఎలా ఇంత తక్కువసమయంలో పూర్తి చేస్తాడు అని అలాగే ఆయన గత చిత్రం అజ్ఞాతవాసి ఇచ్చిన అపజయం కూడా ఈ చిత్రం పైన పెద్ద ప్రభావమే చూపుతున్నది.

అయితే కథ మొత్తం అలాగే షూటింగ్ షెడ్యూల్ కూడా పక్కగా సిద్ధం అయింది అని అందుకే విడుదలని కూడా ముందుగానే ప్రకటించేశారు అని చెబుతున్నారు. మొత్తానికి పోయిన దసరాకి జై లవకుశతో అందరిని ఆకట్టుకున్న ఈ యంగ్ టైగర్ ఈ సంవత్సరం దసరాకి మరోసారి ప్రేక్షకుల ముందుకిరానున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS