త్రివిక్రమ్‌ - ఎన్టీఆర్‌ ఆ రెండూ మిక్స్‌ చేస్తున్నారా?

By iQlikMovies - April 17, 2018 - 14:51 PM IST

మరిన్ని వార్తలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. రికార్డులు కొల్లగొట్టేసింది. అయితే అవే భారీ అంచనాల నడుమ వచ్చిన 'అజ్ఞాతవాసి' మాత్రం దారుణంగా బెడిసికొట్టడంతో, ఈ రెండింటినీ పోల్చుకోకుండా ఉండలేకపోతున్నాం. 

ఇకపోతే, వీటి సంగతి పక్కన పెడితే, త్రివిక్రమ్‌ తాజా సినిమా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌ చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ఎందుకంటే, ముందు అంత పెద్ద డిజాస్టర్‌ ఉండడంతో, ఈ సినిమాపై కొంచెం ఎక్కువగానే కాన్‌సన్‌ట్రేషన్‌ చేశాడట. ముందుగా అనుకున్న స్క్రిప్టులో చాలా వరకూ మార్పులు చేశాడట కానీ, ఈ సినిమాలో కూడా హీరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గానే కనిపించబోతున్నాడట. 'అజ్ఞాతవాసి'లోనూ పవన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరే. అయితే దీన్ని త్రివిక్రమ్‌ ఎందుకు మార్చలేదో సినిమా చూస్తేనే తెలుస్తుందట. 

అయితే 'అత్తారింటికి దారేది'లోని ఎంటర్‌టైన్‌మెంట్‌నీ, 'అజ్ఞాతవాసి'లోని కమిట్‌మెంట్‌ని మిక్స్‌ చేసి ప్రేక్షకులకు చేరువయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడనీ తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఇప్పటికే బరువు తగ్గి, సాఫ్ట్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ లుక్‌లోకి వచ్చేశాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌ న్యూ లుక్‌ ఫోటోలు నెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి.ఆల్రెడీ షూటింగ్‌ స్టార్ట్‌ అయిన ఈ సినిమా ప్రస్తుతం ఓ యాక్షన్‌ సీన్‌ కోసం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో సందడి చేయనుంది. ముద్దుగుమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయనున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS