నందమూరి హీరోల మధ్య గ్రూపులు ఉన్నాయన్నది సినీ జనాల మాట. అయితే.. వీలైన ప్రతీసారీ `మేం ఒక్కటే` అని వీళ్లంతా నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా హరికృష్ణ దూరమయ్యాక... ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను చేరదీసి, `నేనున్నా` అనే భరోసా ఇచ్చాడు బాలకృష్ణ. `అరవింద సమేత వీర రాఘవ` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి బాలయ్య వచ్చి ఆశీర్వదించాడు. అప్పటి నుంచీ... వీళ్ల మధ్య ఉన్న చిన్న గ్యాప్ కూడా పూడిపోయింది. ఇప్పుడు బాలయ్య పుట్టిన రోజు వచ్చింది. ఈ పుట్టిన రోజుకి ఇద్దరు అబ్బాయ్‌లూ బాబాయ్‌కి మనస్ఫూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.
''నాలోని అభిమానిని తట్టిలేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక నేను చూసిన మొట్టమొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టిన రోజు మీ జీవితంలో మరపు రానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.జై బాలయ్య'' అని ట్వీటాడు ఎన్టీఆర్. ''మీరు ఎందరికో బాలయ్య. నాకు మాత్రం తండి తరవాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శనంతోనే సినిమాల్లోకి వచ్చాను. మీ స్ఫూర్తితోనే కొనసాగుతున్నాను'' అని ట్వీట్ చేశాడు. బాబాయ్ పుట్టిన రోజున అబ్బాయిలిద్దరూ ఇలా ట్వీట్ చేయడం నందమూరి ఫ్యాన్స్‌కి ఖుషీ చేస్తున్నాయి.
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK pic.twitter.com/C2zDH9iO44
— Jr NTR (@tarak9999) June 10, 2020
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/ZhRClCvXRJ
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 10, 2020