మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు.? - నందమూరి అభిమానుల నుంచి ఉదయించే ప్రశ్న ఇది. బాలకృష్ణ ఎప్పుడు కనిపించినా.. మీడియా తప్పకుండా ఈ ప్రశ్న అడక్క మానదు. ఎప్పుడూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు బాలయ్య. ఈసారి మాత్రం.. నందమూరి ఫ్యాన్స్‌కి స్వీట్ న్యూస్ చెప్పేశారు.
మోక్షజ్ఞ కోసం అద్భుతమైన కథలు సిద్ధం చేసిపెట్టుకున్నామని, మోక్షజ్ఞ ఎంట్రీ చాలా భారీగా ఉంటుందని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు బాలయ్య. అయితే దర్శకుడు ఇంకా ఖరారు కాలేదన్నారు. అంటే.. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన వార్త వినొచ్చన్నమాట. మోక్షు తొలి సినిమా లిస్టులో బోయపాటి శ్రీను, క్రిష్, పూరి లాంటి దర్శకులు ఉన్నారు. మరి ఆ ఛాన్స్ ఈ ముగ్గురిలో ఎవరికి దొరుకుతుందో?