చరణ్ కి #Respect ఇచ్చిన ఎన్టీఆర్

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ లోని ఒక నటుడు రంగస్థలం చిత్రంతో జన్మించాడు అంటూ రామ్ చరణ్ పైన పొగడ్తల వర్షం కురుస్తున్న నేపధ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తనవంతు ప్రశంసలని హీరో పైన ఈ చిత్రం యూనిట్ పైన కురిపించేశాడు.

మీరు చదవండి ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని, నటీనటుల్ని, దర్శకుడిని ఏమని కీర్తించాడో-


ప్రస్తుతం రామ్ చరణ్-ఎన్టీఆర్ లు#RRR అనే ఒక భారీ మల్టీ స్టారర్ లో కనిపించబోతున్నారు, దీనికి సుప్రసిద్ధ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించనున్న విషయం విదితమే. ఈ సినిమాకి సంబంధించి మేక్ అప్ టెస్టుల కోసం ఈ మధ్యనే వీరిరువురు అమెరికా కూడా వెళ్ళారు అని సోషల్ మీడియాలో ఫోటోలు హల్చల్ చేశాయి.

అలాగే ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరు హీరోలు చాలా తరుచుగా కలుస్తూ సరదాగా గడపడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా ఇద్దరు పెద్ద హీరోల మధ్య ఇటువంటి ఒక ఆరోగ్యకరమైన వాతావారణం ఉండటం మంచిదే..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS