జైలవకుశ చిత్రంతో ఇటు క్రిటిక్స్ అటు కమర్షియల్స్ ని బ్యాలెన్స్ చేసేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం తన కుటుంబంతో విహారయాత్రకి వెళ్ళే సన్నాహాల్లో ఉన్నాడు.
ఇక ఆయన యాత్ర ముగిసాక, తను చేయబోయే చిత్రం గురించిన క్లారిటీ మనకి ఇవ్వనున్నాడు. అయితే ఇప్పటికే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా ఉండనుంది అన్న పక్కా సమాచారం ఉన్నప్పటికీ అది ఎప్పుడు మొదలవనుంది అన్న దాని పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ కి మనం మూవీ ఫేం విక్రమ్ కె కుమార్ ఈ మధ్యనే ఒక పాయింట్ చెప్పినట్టు దానికి ఎన్టీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు వార్తలు మొదలయ్యాయి. అసలే ఇప్పుడు ఏ చిత్రంలో నటిస్తాడు అన్న సందేహాలు నడుస్తున్న వేళ దర్శకుడు విక్రమ్ కె కుమార్ లైన్ లోకి రావడం ఇంకాస్త కన్ఫుజన్ ని పెంచేసింది.
చివరికి ఎన్టీఆర్ ఎవరికి ఎస్ చెబుతాడో అన్నది కాలమే నిర్ణయించాలి.