ఛల్ మోహన్ రంగ పైన రంగస్థలం ఎఫెక్ట్

By iQlikMovies - April 03, 2018 - 18:11 PM IST

మరిన్ని వార్తలు

యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ప్రస్తుతం నితిన్ సహా చిత్ర యూనిట్ మొత్తం ప్రీ-రిలీజ్ టూర్ పేరిట ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి ఒక పెద్ద తలనొప్పి వచ్చిపడింది. అదెలాగూ అంటే- ప్రస్తుతం రంగస్థలం చిత్రం మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నది, దీనికి ఈ సంవత్సరపు సమ్మర్ హిట్ అనే పేరు కూడా వచ్చేసింది. ఈ తరుణంలో వేరే చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న ప్రశ్న మొదలైంది.

అలాగే నితిన్-మేఘా ఆకాష్ ల గత చిత్రం లై బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది, పైగా ఈ సినిమాకి కథ అందించిన త్రివిక్రమ్ కూడా కెరీర్ లో డౌన్ ఉన్నాడు. ఇన్న అడ్డంకుల మధ్య ఈ చిత్రం థియేటర్లలో ఎలా తన సత్తా చాటుతుందో అని అందరు వేచి చూస్తున్నారు.

ఇక కచ్చితంగా సక్సెస్ అవసరమైన దశలో ఉన్న నితిన్ కి ఈ చిత్రం ఏ విధమైన ప్రతిఫలం ఇస్తుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS