ఎన్టీయార్‌ డాన్సులు ఇరగదీసేస్తున్నాడు

మరిన్ని వార్తలు

ఎన్టీయార్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'జై లవకుశ'. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తోన్న సంగతి తెలిసినదే కదా. ఇంకో వైపున ఎన్టీయార్‌ డాన్సులంటే ఆ కిక్కే వేరప్పా. ఏ సినిమా చేసినా అందులో డాన్సులు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాడు యంగ్‌ టైగర్‌. తాజాగా 'జై లవకుశ' సినిమా కోసం సాంగ్‌ చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్‌ వేసిన స్టెప్పులకి చిత్ర యూనిట్‌ అంతా షాక్‌ తింటున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. ఎన్టీయార్‌ డాన్సులు అద్భుతమైనీ, ఆ డాన్సుల్ని దగ్గరుండి చూడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు బాబీ. ఎన్టీయార్‌ డాన్సుల్లో కిక్‌ ఉంటుంది, ఆయన డాన్సుల్లో స్టైల్‌ ఉంటుంది, డాన్సులేసేటప్పుడు ఎన్టీయార్‌కి మాత్రమే ప్రత్యేకమైన ఓ ఈజ్‌ కనిపిస్తుంటుంది. ఆ ఈజ్‌ని చూసి బాబీ షాక్‌కి గురయ్యాడట. నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తోన్న 'జై లవకుశ' సినిమా ఈ విజయదశమికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు 'జై లవకుశ' సినిమా షూటింగ్‌, ఇంకో వైపున 'బిగ్‌బాస్‌' రియాల్టీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తుండడం ఇంత బిజీలోనూ ఏ షెడ్యూల్‌కీ ఇబ్బంది రాకుండా చూసుకోవడం చిన్న విషయం కాదు. ఇంత టెన్షన్‌లో కూడా ఎన్టీయార్‌ మెస్మరైజింగ్‌ డాన్సులు వేస్తున్నాడంటే హేట్సాఫ్‌ అనాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS