లక్ష్మీరాయ్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న సినిమా 'జూలీ - 2' ఈ సినిమాతో లక్ష్మీరాయ్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. కాగా ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే ఈ సినిమాలోని బికినీల జాతర అలాంటిది. తెలుగు సినిమాల్లో అంత విచ్చలవిడిగా బికినీ ప్రదర్శన ఉండదు. ఈ సినిమాలో నూరు రకాల బికినీల్లో లక్ష్మీరాయ్ రెచ్చిపోయింది. ఫస్ట్‌లుక్‌తో కొంత, టీజర్లో ఇంకొంత లక్ష్మీరాయ్ అందాల్ని చూపించి ఊరించేశారు. ఇక ట్రైలర్లోనూ చూపించాల్సిన దాని కంటే ఎక్కువే చూపించారు. బొద్దుగా ముద్దుగా ఉండే లక్ష్మీరాయ్ ఈ సినిమా కోసం 13 కేజీల బరువు తగ్గి, నాజూగ్గా మారింది. నాజూకు సొగసులో ఆమె బికినీ అందాల్ని వర్ణించడమే కష్టంగా ఉంది. అసలెప్పుడు లక్ష్మీరామ్ ఇంత సన్నగా మారిపోయిందనుకునే వాళ్లే అంతా. అంత నాజూగ్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా, ఇక ట్రైలర్ వచ్చాక సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. లక్ష్మీ రాయ్‌కి ఈ సినిమా ఓ మంచి విజయం తెచ్చిపెడుతందనీ, ఈ సినిమాతో బాలీవుడ్లో ఆమె పాతుకుపోవడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు. ఇన్ని రకాల బికినీల్లో ఆమె స్కిన్ షో చేస్తుంటే, తోటి హీరోయిన్లు జలస్ ఫీలవక తప్పదు. అంతగా ఉంది లక్ష్మీరాయ్ పర్ఫామెన్స్ ట్రైలర్లో చూస్తుంటే, ట్రైలర్లోనే ఇంత ఉంటే, ఇక సినిమాలో ఎంతుండబోతోందో కదా. అడల్ట్ కంటెన్ట్ మూవీ ఇది. ఏరి కోరి ఆమెను ఎంచుకున్న సినిమా ఇది. ఈ సినిమా హిట్ అయితే లక్ష్మీ రాయ్ దశ తిరిగిపోయినట్లే.