చిక్కుల్లో 'అర్జున్‌ రెడ్డి' బ్యూటీ: కారణమిదే.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ నుండి ఆఫర్స్‌ రాగానే నేల మీద అడుగులు నిలబడవు ముద్దుగుమ్మలకి. అఫ్‌కోర్స్‌.. అందరూ కాదులెండి. కొందరు భామలు. తాజాగా 'అర్జున్‌ రెడ్డి' బ్యూటీ షాలినీ పాండేకీ బాలీవుడ్‌ నుండి ఓ మంచి ఆఫర్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్‌ చూసుకుని, సౌత్‌ సినిమాని లైట్‌ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ భాషల్లో షాలినీ పాండే బాగానే ఆఫర్లు దక్కించుకుంటోంది. తెలుగులో షాలినీ నటిస్తున్న 'ఇద్దరి లోకం ఒకటే' చిత్రం ఈ క్రిస్‌మస్‌కి విడుదల కానుంది.

 

తమిళంలో విజయ్‌ ఆంటోనీ, అరుణ్‌ విజయ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఓ సినిమా తెలుగులో 'జ్వాల' అనే పేరుతో విడుదల కానుంది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఈ 'జ్వాల' సినిమాకి సంబంధించి షూటింగ్‌ ఇంకా పెండింగ్‌లో ఉందట. అయితే, ఆ పెండింగ్‌లో ఉన్న షూటింగ్‌కి హ్యాండిచ్చేసి షాలినీ పాండే బాలీవుడ్‌కి చెక్కేయాలనుకుంటోందట. అన్యాయమే కదండీ. సగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమాని మధ్యలోనే వదిలేస్తే ఆ నిర్మాతల పరిస్థితేంటీ.? అందుకే సదరు నిర్మాతలు షాలినీ పాండే తీరుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారట.

 

ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి, షాలినీ కెరీర్‌ని దెబ్బ తీసేలోగానే తన ఆలోచన మార్చుకుంటే బాగుంటుందని షాలినీ అభిమానులు, సన్నిహితులు షాలినికి సూచిస్తున్నారట. మరి ఈ చక్కనమ్మ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా.? బుద్దిగా ఆ సినిమాని పూర్తి చేస్తుందా.? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS