వరుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఫిదా`. జూలై 21న వరల్డ్‌వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. యు.ఎస్‌లో ఇప్పటికే `ఫిదా` మిలియన్ డాలర్స్ క్లబ్‌లోకి చేరింది. స్వతంత్ర్య భావాలున్న ఓ తెలంగాణ అమ్మాయికి, ఎన్నారై యువకుడి మధ్య జరిగే అందమైన ప్రేమకథ, కుటుంబ పరమైన భావోద్వేగాలు యువత, కుటుంబకథా చిత్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందరినీ మెప్పిస్తున్న ఈ సినిమాను తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చాలా చక్కగా ఉందని, దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్‌రాజు సినిమాను అద్భుతంగా రూపొందించారని,నటీనటులు చక్కగా నటించారని అప్రిసియేట్ చేసిన కె.సి.ఆర్. వీలు చూసుకుని చిత్ర యూనిట్ తనను కలవాలని ఆహ్వానించారు.
-ప్రెస్ రిలీజ్