మహేష్‌ కొత్తేపారం 'సూపర్‌' బాస్‌!

మరిన్ని వార్తలు

ఈ మధ్య ఆన్‌లైన్‌ బిజినెస్‌ ఎంతగా జనాలకు చేరువైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్మార్ట్‌ వినియోగం ఈ ఆన్‌లైన్‌ షాపింగ్స్‌కి వేదికవుతోంది. ఇంట్లోనే కూర్చొని మొబైల్‌ ఫోన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు, ఏ ప్రొడక్ట్‌ అయినా ఇంటికొచ్చేస్తోంది. అయితే, ఈ ఆన్‌లైన్‌ షాపింగ్స్‌కి ప్రత్యేకమైన సంస్థలతో పాటు, సామాన్యులూ, సామాన్యులతో పాటు, సినీ స్టార్లూ కూడా పోటీపడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలువురు స్టార్స్‌ ఈ ఆన్‌లైన్‌ బిజినెస్‌ ద్వారా ఆర్ధిక పరంగా లాభాలు పొందుతున్నారు.

 

టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ సొంతంగా దుస్తుల బ్రాండ్‌ని రన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 'రౌడీ' పేరుతో ఆయన ఈ ఆన్‌లైన్‌ బిజినెస్‌ కొనసాగిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో అయితే, సన్నీలియోని, దీపికా, హృతిక్‌ రోషన్‌ తదితరులు ఈ ఆన్‌లైన్‌ బిజినెస్‌లో తమదైన సత్తా చాటుతున్నారు. ఇక తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కూడా ఆన్‌లైన్‌ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. ఓ దుస్తుల బ్రాండ్‌ని త్వరలో మహేష్‌ ప్రారంభించబోతున్నారట. ఈ విషయానికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ లింక్‌ని మహేష్‌ బృందం పోస్ట్‌ చేసింది.

 

ఆ పోస్ట్‌ని మహేష్‌ తిరిగి షేర్‌ చేశారు. అంతేకాదు, మూడు రోజుల కౌంట్‌డౌన్‌ కూడా ఉంచారు. ఈ వెబ్‌సైట్‌లో ఏమేం దుస్తుల బ్రాండ్స్‌ ఉండబోతున్నాయో, ఆ వివరాలు కూడా ఈ పేజీ కింది భాగంలో ఉంచారు. అంటే మరో మూడు రోజుల్లోనే మహేష్‌ ఆన్‌లైన్‌ బిజినెస్‌ స్టార్ట్‌ కానుందన్న మాట. ఇప్పటికే వాణిజ్య ప్రకటనలు, ఏఎమ్‌బీ సినిమాస్‌తో పాటు, పలు రకాల బిజినెస్‌లు మహేష్‌ ఖాతాలో ఉన్నాయి. ఈ తాజా బిజినెస్‌ ఎలా ఉండబోతోందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS