మన్మధుడితో 'మాస్‌' హీరోయిన్‌ జోడీ అదిరింది బాస్‌.?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ మన్మధుడుగా అభివర్ణించబడుతోన్న నాగార్జున ప్రస్తుతం 'మన్మధుడు' సినిమాకి సీక్వెల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'మన్మధుడు 2' టైటిల్‌తో యంగ్‌ డైరెక్టర్‌ కమ్‌ హీరో రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే నాగార్జున మరో సినిమాని పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడు. అదే 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న మూవీ ఇది. ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్‌గా నటించే ముద్దుగుమ్మ వేటలో ప్రస్తుతం చిత్రయూనిట్‌ తలమునకలైంది. మొన్నా మధ్య ఈ సినిమా కోసం ఆర్‌ఎక్స్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ పేరు బాగా వినిపించింది. కానీ 'మన్మధుడు 2' కోసం తననెవరకూ సంప్రదించలేదని ఈ బ్యూటీ తేల్చేయడంతో ఆ గాసిప్స్‌కి చెక్‌ పడింది. ఒక్కోసారి గాసిప్స్‌ కూడా నిజం అయ్యేలా చేస్తాయి. కానీ ఎందుకో పాయల్‌కి ఆ అవకాశం దక్కలేదు. 'వెంకీమామ'లో మరో సీనియర్‌ హీరో వెంకీతో సరిపెట్టుకుంది పాయల్‌ రాజ్‌పుత్‌. ఇక 'మన్మధుడు 2' కోసం తాజాగా మరో సీనియర్‌ భామ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, జ్యోతిక. గతంలో నాగార్జునతో 'మాస్‌' వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీలో నటించింది జ్యోతిక. 'మాస'్‌తో పాటు, చిరంజీవితో 'ఠాగూర్‌' తదితర సినిమాల్లో పలువురు హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత డైరెక్ట్‌ తెలుగు సినిమాల్లో నటించలేదు.

 

ప్రస్తుతం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీలతో తమిళంలో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. మళ్లీ ఇన్నాళ్లకు జ్యోతికను 'బంగార్రాజు'తో నాగార్జున టాలీవుడ్‌కి తీసుకురాబోతున్నాడనిపిస్తోంది. జ్యోతిక - నాగ్‌ జంట చూడచక్కగా ఉంటుందంటూ ఫ్యాన్స్‌ నుండి అప్పుడే పోజిటివ్‌ రిపోర్ట్స్‌ వచ్చేస్తున్నాయి. చూడాలి మరి.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS