ఎందుకో... రాఘవేంద్రరావుకి కెమెరా ముందుకొచ్చి నటించాలని అనిపించింది. అందుకే ఇప్పుడు రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్నారు. 2021 జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందట. రాఘవేంద్రరావు సినిమా అంటే గ్లామర్ లేకపోతే ఎలా? అందుకే ఈ సినిమాలోనూ అందాల భామల్ని మోహరించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటాయని టాక్. ఆయా పాత్రల కోసం సమంత, రమ్యకృష్ణ, శ్రియలను తీసుకోబోతున్నార్ట.
అయితే ఇవి అతిథి పాత్రలా? లేదంటే నిజంగా పూర్తి స్థాయి హీరోయిన్ వేషాలా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. దర్శకులంతా అప్పుడప్పుడూ కెమెరా ముందుకు వస్తుంటారు. చిన్న చిన్న పాత్రలు చేస్తుంటారు. దాసరి అయితే.. హీరోగానూ కనిపించారు. ఆ తరవాత.. పూర్తి స్థాయి పాత్ర పోషిస్తోంది రాఘవేంద్రరావునేమో.?? మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది? దర్శకేంద్రుడి నటనా పటిమ ఎలాంటిది? ఈ విషయాలు తెలియాలంటే 2021 వరకూ ఆగాలి.