లూసీఫ‌ర్‌కి ద‌ర్శ‌కుడు అత‌నేనా?

By Gowthami - April 10, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన లూసీఫ‌ర్ రీమేక్‌రైట్స్ రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి న‌టిస్తార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. కానీ ఎందుక‌నో.. ఈ స్క్రిప్టుని ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఈ రీమేక్ ప‌నులు మొద‌లైన‌ట్టు తెలుస్తోంది. ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో లూసీఫ‌ర్ రీమేక్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు చిరంజీవి. ఈ క‌థ‌ని త‌న కోస‌మే తీసుకున్నార‌ని, త‌న త‌మ్ముడు ప‌వ‌న్ కల్యాణ్ గనుక లూసీఫ‌ర్ రీమేక్ రైట్స్ ఇవ్వ‌మ‌ని అడిగితే - ఆనందంగా ఇస్తాన‌ని చెప్పుకొచ్చారు.

 

అయితే.. ఇప్పుడు ఈ రీమేక్‌లో్ చిరంజీవినే న‌టిస్తార‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు కూడా దొరికేశాడ‌ని టాక్‌. ఆ అవ‌కాశం బాబీకి ద‌క్కింద‌ట‌. జై ల‌వ‌కుశ‌తో ఫామ్ లోకి వ‌చ్చాడు బాబీ. వెంకీ మామ కూడా హిట్ జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు ఈ లూసీఫ‌ర్ రీమేక్ బాధ్య‌త‌ల్ని ఆయ‌న తీసుకున్నార్ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో బాబీ ఓ సినిమా చేస్తార‌ని మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికంటే ముందుగానే లూసీఫ‌ర్ ప‌ట్టాలెక్కే ఛాన్సుంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అతిథి పాత్ర‌లో క‌నిపించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS