150 కోట్ల చేరువలో 'కబీర్‌సింగ్‌'!

By iQlikMovies - June 28, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

హిందీ 'అర్జున్‌రెడ్డి' 'కబీర్‌సింగ్‌' దూకుడుకు బ్రేకేలేసేవారే లేకపోయారు. ఓపెనింగ్‌ డే నుండీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది 'కబీర్‌సింగ్‌'. వాస్తవానికి ఈ సినిమాకి టాక్‌ ఏమంత గొప్పగా రాలేదు. కానీ, యూత్‌ ఎట్రాక్టివ్‌ కంటెంట్‌ కావడంతో సినిమాకి వసూళ్లు భారీ స్థాయిలో వచ్చేస్తున్నాయి. ఈ మధ్య విడుదలైన బాలీవుడ్‌ సినిమాల్లో ఈ స్థాయిలో వసూళ్లు ఈ సినిమాకే వచ్చాయంటే అతిశయోక్తి కాదేమో.

 

మొదటి వారం గడిచేసరికి 'కబీర్‌సింగ్‌' 135 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. ఇక 150 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. వసూళ్లు ఈ రేంజ్‌లో ఉన్నా, సినిమాపై విమర్శలు మాత్రం అలాగే ఉన్నాయి. ఓ తెలుగు రీమేక్‌ సినిమాకి ఈ రేంజ్‌లో వసూళ్లు వస్తుండడం బాలీవుడ్‌ ట్రేడ్‌ గణం జీర్ణించుకోలేకపోతోంది. దాంతో ఈ సినిమాపై చేయాల్సిన యాగీ చేస్తోంది. ఎంత ఎక్కువ యాగీ చేస్తే అంతగా అది సినిమా విజయానికి దారి తీస్తోంది.

 

ఈ రచ్చతో ప్రత్యేకంగా ఈ సినిమాకి పబ్లిసిటీతో పని లేకుండా పోయింది. ఈ ఫ్రీ పబ్లిసిటీతోనే బాక్సాఫీస్‌కి 'కబీర్‌సింగ్‌' కాసుల పంట పండిస్తోంది. ఒరిజినల్‌ తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమానీ తెరకెక్కించారు. షాహిద్‌ కపూర్‌, కైరా అద్వానీ జంటగా నటించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS