'అర్జున్‌రెడ్డి' అక్కడా దుమ్ము దులిపేస్తున్నాడు!

మరిన్ని వార్తలు

తెలుగులో సంచలన విజయం అందుకున్న సినిమా 'అర్జున్‌రెడ్డి'ని హిందీలో 'కబీర్‌సింగ్‌' పేరుతో రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఎంత సెన్సేషన్‌ అయ్యిందో, హిందీలోనూ అంతే సెన్సేషన్‌ అవుతోంది ఈ సినిమా. ఇప్పటికే 60కోట్లు వసూళ్లు సాధించిన 'కబీర్‌సింగ్‌' త్వరలో 100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టడం ఖాయమని అక్కడి ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే, వీకెండ్‌ కావడంతో ఈ మూడు రోజుల కలెక్షన్లు జోరుగా ఉన్నాయి. అయితే, ఈ వారం కలెక్షన్స్‌ సంగతి ఎలా ఉండబోతోందో చూడాలి మరి.

 

ఏది ఏమైనా 100 కోట్లు కొల్లగొట్టడం పక్కా అంటున్నారు. ఇక తెలుగులో ఏ రేంజ్‌లో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంటే, అదే రేంజ్‌లో విమర్శలు కూడా అందుకుంది ఈ సినిమా. బాలీవుడ్‌లో అవి తక్కువే అనుకుంటే పొరపాటే. అక్కడ కూడా ఈ సినిమాని వ్యతిరేకించే వాళ్లు బాగానే ఉన్నారు. అయినా, కానీ, యూత్‌ మాత్రం తెగ కనెక్ట్‌ అయిపోతున్నారు. హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌, రొమాంటిక్‌ సీన్స్‌, ముఖ్యంగా లిప్‌లాక్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే, హీరో ఆటిట్యూడ్‌ దగ్గర నుండి, హీరోయిన్‌ కైరా అద్వానీ క్రేజ్‌ ఈ సినిమాకి బాగా కలిసొచ్చేశాయి.

 

సందీప్‌ రెడ్డి వంగా పేరు అక్కడ కూడా మార్మోగిపోతోంది ఈ సినిమాతో. బాలీవుడ్‌లో ఈ ఏడాది ఇదే బ్లాక్‌ బస్టర్‌ అనేంతలా అక్కడ వసూళ్ల వర్షం కురుస్తోందట. ఏది ఏమైతేనేం, మన తెలుగు డైరెక్టర్‌ బాలీవుడ్‌లో సత్తా చాటడం సంతోషించదగ్గ విషయమే కదా. మరోవైపు తమిళ అర్జున్‌రెడ్డి 'ఆదిత్య వర్మ' రిలీజ్‌కి ముస్తాబవుతోంది. చూడాలి మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS