టాలీవుడ్ సంచలనం 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'కబీర్‌సింగ్' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒరిజినల్ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమానీ తెరకెక్కించాడు. అయితే, 'కబీర్‌సింగ్'లో ముద్దులు హద్దులు దాటినట్లు కనిపించడం లేదు. హద్దులు దాటిన ముద్దుల పోస్టర్స్‌తోనే 'అర్జున్‌రెడ్డి' తెలుగులో సంచలనాలు సృష్టించింది. నిజానికి బాలీవుడ్లో ఈ డోస్ ఇంకాస్త ఎక్కువే ఉంటుందనుకున్నారు.
లిప్‌లాక్స్ అయితే ఉన్నాయి. కానీ, అవి మరీ హద్దులు దాటలేదు. విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్ పరకాయ ప్రవేశం చేశాడు. షాలినీ పాండే పాత్రను కైరా అద్వానీ చక్కగా పోషించింది. షాహిద్, కైరా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. తెలుగు అర్జున్‌రెడ్డి ఫ్లేవర్ ఎక్కడా మిస్ చేయకుండా, ఓవర్ యాక్షన్‌కి పోకుండా, సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని టేకప్ చేశాడు.
షాహిద్, కైరా నటనతో తెలుగు అర్జున్‌రెడ్డి చూసిన వారికి కూడా ఈ 'కబీర్‌సింగ్' చూసేందుకు అస్సలు బోర్ కొట్టకుండా ఉంటుందనడం అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా అర్జున్‌రెడ్డి హిట్‌కి ప్రధాన కారణం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్‌ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వాడేశాడు హిందీలో కూడా డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా. ట్రైలర్ చూస్తుంటే, జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్న 'కబీర్‌సింగ్' బాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా సమ్‌థింగ్ మ్యాజిక్ చేసేలానే కనిపిస్తోంది. చూడాలి మరి.